MAA Elections: 'ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు..అంతా అధ్యక్షుడిదే'..: కృష్ణమోహన్

MAA Elections 2021: 'మా'’ ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్‌ చేసిన ట్వీట్‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ రిప్లై ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 04:35 PM IST
MAA Elections: 'ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు..అంతా అధ్యక్షుడిదే'..: కృష్ణమోహన్

MAA Elections 2021: 'మా'’ ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) చేసిన ట్వీట్‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌(krishna mohan) స్పందించారు. ‘మా’ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌తోనే త‌న బాధ్య‌త పూర్త‌య్యింద‌ని, ఆ తర్వాత జోక్యం చేసుకోవడానికి తనకెలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. 

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు(MAA Elections 2021) జరిగిన రోజున, కౌంటింగ్‌ జరిగిన సమయంలో కానీ తనకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అప్పుడే ఫిర్యాదు చేసుంటే చర్యలు తీసుకునేవాడినన్నారు. ఎన్నిక‌ల నాటి సీసీ టీవీ ఫుటేజీ(CCTV Footage) ఇచ్చేందుకు తనకి అధికారం లేదని తెలిపారు. ‘తొలిసారి ఆయన ఫుటేజీ అడిగినప్పుడు పరిశీలించి చెప్తాను అన్నాను. కానీ, ఇస్తానని అనలేదు’ అని అన్నారు. న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు తాను న‌డుచుకుంటాన‌ని పేర్కొన్నారు. ఇకపై అధికారమంతా అధ్యక్షుడి(Manchu vishnu) చేతిలోనే ఉంటుందన్నారు. 

Also read: Prakash raj MAA Controversy: తెరపైకి మళ్లీ 'మా' రగడ.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్

ఎన్నికల్లో వైకాపా నాయకుల(Ycp leaders) జోక్యముందని ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) చేసిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు.‘'మా'’ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కొన్ని రోజుల క్రితం ఎన్నికల అధికారికి ప్రకాశ్‌ రాజ్‌ లేఖ రాశారు. సీసీ ఫుటేజీ కావాలని అందులో కోరారు. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చూపిస్తూ మరోసారి సీసీ ఫుటేజీ ఇవ్వమని ట్విటర్‌ ద్వారా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ని ప్రకాశ్‌రాజ్‌ అడిగారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x