Kannappa Teaser:  ఈమధ్య కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్న.. విష్ణు.. ఫైనల్ గా మళ్ళీ హీరోగా.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి రెగ్యులర్.. కమర్షియల్ సినిమా కాకుండా.. కన్నప్ప అనే ఫ్యాంటసీ సినిమాతో..ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముకేష్ కుమార్ సింగ్.. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ రాజ్ శేఖర్ లతో పాటు ప్రభాస్ కూడా కీలక క్యామియో పాత్రలో.. కనిపించనున్నారు. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. చాలా కాలం తర్వాత.. వెండితెర మీద కనిపించబోతున్న విష్ణు మంచు..సినిమాలో.. అదరగొట్టే యాక్షన్ లో కనిపించనున్నారు అని ఈరోజు విడుదలైన టిజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో ఆయన లుక్ కూడా ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేసింది. సినిమాకోసం మంచు విష్ణు చాలానే కష్టపడ్డారు అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. విజువల్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి.


 



దాదాపు టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలు.. మాత్రమే కనిపించాయి. కథ గురించి మాత్రం.. టీజర్ లో హింట్స్ ఏమీ వదలలేదు. అయితే సినిమాలో విజువల్స్ హైలైట్ అవుతాయి.. అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్.. పాత్రకి కూడా బాగానే స్కోప్.. ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా బాగా కనిపించింది. ఇక సినిమాకి మైన్ సెల్లింగ్ పాయింట్.. ప్రభాస్ అయినప్పుడు.. ప్రభాస్ ని చూపించకుండా టీజర్ ఉంటుందా? అయితే ప్రభాస్ కేవలం ఒక్క సెకండ్ మాత్రమే ఈ టీజర్ లో కనిపించారు. ఆ ఒక్క సెకండ్.. ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చింది. సైడ్ యాంగిల్ నుండి ప్రభాస్ ను చూపించారు దర్శక నిర్మాతలు. కాగా ఈ టీజర్ చూస్తే.. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నందీశ్వరుడి..పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని అర్థమవుతోంది. కానీ సినిమాలో కూడా ప్రభాస్ నిడివి..తక్కువే ఉంటుందా అనే ఆలోచన కూడా ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ ప్రశ్నకు జవాబు దొరకాలంటే మాత్రం.. సినిమా విడుదల వరకు వేచి చూడాలి.


ఇక ఈ టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. ఇక నిమిషం నిడివి.. ఉన్న ఈ టీజర్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగింది. ఆఖరిలో మంచు విష్ణు శివయ్య.. అని అరవడంతో టీజర్ ఎండ్ అవుతుంది. మొత్తం పైన సినిమాపై అంచనాలు పెంచే..విధంగానే టీజర్ ఆకట్టుకుంది. 


కాగా.‌ డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు సినిమా యూనిట్. ఈ కార్యక్రమంలో..మోహన్ బాబు మాట్లాడుతూ..‘కన్నప్ప సినిమా ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాం. ఎంతో వ్యయప్రయాసతో నిర్మించాం. శరత్ కుమార్ ముందుగా తీసిన పెదరాయుడు చిత్రాన్ని నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజు గారితో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప.. తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు.. గారు మాకు ఇచ్చేశారు,’.. అని చెప్పకువచ్చారు.


ఆ తరువాత ఈ సినిమా గురించి హీరో విష్ణు మంచు మాట్లాడుతూ’కన్నప్పను ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు.. ప్రచారం చేస్తున్నాడు.. సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి వస్తున్న సపోర్ట్‌ని చూస్తూనే ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. అందుకే వాళ్లలోంచి కొంత మందిని ఇక్కడకు పిలిచాను. 2014లో కన్నప్ప ప్రయాణం మొదలైంది. 2015లో నేను కన్నప్పని డెవలప్ చేస్తూ వెళ్తుంటే.. తణికెళ్ల భరణి గారు పూర్తిగా నాకే అప్పగించారు. నా దైవం, నా తండ్రి మోహన్ బాబు గారు, విన్ని, వినయ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కన్నప్పను ఇప్పుడు మీ ముందుకి తీసుకో రాగలిగాము శివుని ఆశీస్సుల వల్లే సినిమాను తీయగలిగాం. కన్నప్ప మైథాలజీ కాదు.. కన్నప్ప మన చరిత్ర.  కన్నప్ప నా బిడ్డలాంటిది. ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాము. ఈ కన్నప్ప మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. హర హర మహదేవ్’ అని చెప్పుకొచ్చారు.


Also Read: Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్‌.. పూల బొకేలు తిరస్కరణ


Also Read: Amaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్‌.. ఊపిరి పోసుకున్న అమరావతి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter