Manchu Vishnu Prabhudeva Movie: ప్రస్తుతానికి మంచు ఫ్యామిలీ టైం అసలు ఏమాత్రం బాగాలేదు. చివరిగా మంచు మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా భారీ డిజాస్టర్ గా నిలవగా తర్వాత మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా టాక్ పరంగా బాగానే ఉంది అనిపించుకున్నా పోటీగా మరో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రంగంలోకి దిగడంతో ఈ సినిమా దారుణమైన కలెక్షన్లు చవి చూడాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా టోటల్ రన్ మొత్తం కలిపితే 80 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. ఆ 80 లక్షలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ రెమ్యూనరేషన్లు కూడా రావని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మార్కెట్ మరింత దిగజారినట్లు అయింది అయితే ఆయనతో ఇంకెవరు సినిమాలు చేస్తారు మళ్లీ ఇలాగే సొంత ప్రొడక్షన్ లో సినిమాలు చేసుకోవడం తప్పదని భావిస్తున్న తరుణంలో ఆయనకు ఒక జాక్పాట్ లాంటి ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తోంది.


గత కొన్నాళ్లుగా ప్రభుదేవా డైరెక్టర్ గా బాలీవుడ్లో చేస్తున్న సినిమాలేవి కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి సౌత్ లో ఒక మంచి హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నాడు. తక్కువ బడ్జెట్లో మంచి సినిమా చేయాలని భావిస్తున్న ఆయన ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ కి మంచు విష్ణు అయితే కరెక్ట్ గా ఉంటాడని ప్రభుదేవా భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిన్నా సినిమాకు ఒక సాంగ్  కు కూడా ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.


ఈ నేపథ్యంలోనే అప్పటి సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుదేవా మంచు విష్ణుకి ఒక కథ చెప్పారని, మంచు విష్ణు కూడా వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఎలా అయినా ఒక కమర్షియల్ హిట్ కొట్టాలని భావిస్తున్న మంచు విష్ణు ప్రభుదేవా సినిమాతో ఆ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే అవకాశం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.     ఇటీవల మంచు విష్ణు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన దగ్గర కొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని అవి ఫైనల్ అయిన తర్వాత తానే అధికారికంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.


Also Read: Hit 2 Teaser : అంచనాలు పెంచేస్తున్న కేడీ.. హిట్ 2 టీజర్ టాక్.. యత్ర నార్యస్తు పూజ్యంతే!


Also Read: Ram Charan Sukumar Movie: చెర్రీ ఫాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్.. సుకుమార్ సినిమా షూట్ కూడా మొదలు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook