Mani Sharma Mother Passed Away: కృష్ణంరాజు మరణం మరువక ముందే మణిశర్మ ఇంట తీవ్ర విషాదం..
Mani Sharma Mother Yanamandra Saraswati Passed Away: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Mani Sharma Mother Yanamandra Saraswati Passed Away: టాలీవుడ్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి దేవి తాజాగా కన్నుమూశారు.
ఆమె వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో వయోభారం రీత్యా ఆమె కన్నుమూసినట్లు సమాచారం అందుతుంది. మచిలీపట్నంలో జన్మించిన మణిశర్మ ఆ తర్వాత అనేకమంది సంగీత దర్శకుల దగ్గర కంపోజర్ గా పనిచేశారు. అశ్వినీ దత్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా రూపొందిన చూడాలని ఉంది సినిమాతో ఆయన సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు.
ఆ తర్వాత స్వరబ్రహ్మ మణిశర్మగా పేరు తెచ్చుకుని అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ కూడా సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి అనేకమంది యువ హీరోలతో పాటు బడా హీరోలతో కూడా పనిచేసే అవకాశం దక్కించుకుంటున్నారు. ఇక మణిశర్మ చాలా కాలం పాటు సైలెన్స్ పాటించి ఇప్పుడే మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఆయన పలు పెద్ద ప్రాజెక్టులకు కూడా ఇప్పుడు సంగీతం అందిస్తున్నారు.
సరిగ్గా కృష్ణంరాజు మరణించిన వార్త తెలుగు సినీ పరిశ్రమను పట్టి కుదిపేస్తున్న సమయంలో మణిశర్మ తల్లి కూడా మరణించడంతో మణిశర్మ కుటుంబం అంతా ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు పలువురు మణిశర్మ తల్లి మృతి చెందిన క్రమంలో ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తూ మణిశర్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Junior NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర అభిమానుల హంగామా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి