Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ మంజుల ఘట్టమనేని పోస్ట్.. అదే చివరిది అవుతుందని అనుకోలేదట
Manjula Ghattamaneni Recalls Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ గత నెల మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణానికి కొద్ది రోజుల ముందే మంజుల బర్త్ డే వచ్చిందట. ఆ రోజును గుర్తు చేసుకుంటూ మంజుల ఎమోషనల్ అయింది.
Manjula Ghattamaneni Recalls Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ మరణం (నవంబర్ 15)తో ఘట్టమనేని ఫ్యామిలీకి, అభిమానులకు తీరని లోటు. కృష్ణ మరణించి దాదాపు 21 రోజులు అవుతున్నా కూడా మంజుల ఘట్టమనేని మాత్రం ఇంకా తండ్రి స్మృతులను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయే ఓ వారం ముందు మంజుల బర్త్ డే వచ్చిందట. ఈ బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్ కృష్ణ ఎంతో చలాకిగా కనిపించాడు. అయితే ఆ ఫోటోలను షేర్ చేస్తూ మంజుల తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది.
నా బర్త్ డే జరిగి సరిగ్గా ఈ రోజు (నవంబర్ 8)కి నెల అవుతోంది.. ఈ స్వీట్ మెమోరీయో.. జీవిత కాలపు జ్ఞాపకంగా మారుతుందని అప్పుడు నేను ఊహించలేదు.. నా బర్త్ డే నవంబర్ 8వ తేదీయే మా ఫ్యామిలీ అంతా కలిసి లంచ్ చేసిన చివరి రోజు.. అప్పుడు మా నాన్న ఎప్పటిలానే ఎంతో చురుగ్గా కనిపించాడు.. అందరం కలిసి ఎంతో సరదాగా ఆరోజును గడిపేశాం.
నాన్నా.. నువ్ లేకుండా ఒక్కో రోజు ఎంతో కష్టంగా గడుస్తోంది.. నువ్ నాతో పాటు ఉండాలని నేను ఎంతగా కోరుకున్నానో మాటల్లో చెప్పలేను.. ఈ బర్త్ డేను మాత్రం నేను ఎప్పటికీ జీవితాంతం గుర్తు పెట్టుకునే ఉంటాను అని మంజుల ఎమోషనల్ అయింది.
ఇక ఘట్టమనేని ఇంట్లో ఈ ఏడాది వరుసగా విషాదలు నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరిలో రమేష్ బాబు, సెప్టెంబర్‌లో ఇందిరా దేవీ, నవంబర్‌లో సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇలా మహేష్ బాబుకు, ఘట్టమనేని ఫ్యామిలీలకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే వచ్చింది. చివరకు మహేష్ తన తండ్రి మరణంతో పూర్తిగా కుంగిపోయాడు.
Also Read : Hari Hara Veera Mallu : ఇరవై ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. క్రిష్ కామెంట్స్ వైరల్
Also Read : Adivi Sesh : కుక్క కంటే తక్కువ స్క్రీన్ స్పేప్.. ఇది నా శాపం.. అడివి శేష్‌పై నెటిజన్ కామెంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook