Adivi Sesh : కుక్క కంటే తక్కువ స్క్రీన్ స్పేప్.. ఇది నా శాపం.. అడివి శేష్‌పై నెటిజన్ కామెంట్

Adivi Sesh Funny Chit chat అడివి శేష్ తాజాగా తన అభిమానులతో నెట్టింట్లో చిట్ చాట్ చేశాడు. అభిమానులతో ట్విట్టర్‌లో చాటింగ్ చేసిన వేళ కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2022, 08:50 PM IST
  • బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేసిన హిట్ 2
  • సక్సెస్ టూర్లో బిజీబిజీగా అడివి శేష్
  • ట్విట్టర్‌లో అడివి శేష్ చిట్ చాట్
Adivi Sesh : కుక్క కంటే తక్కువ స్క్రీన్ స్పేప్.. ఇది నా శాపం.. అడివి శేష్‌పై నెటిజన్ కామెంట్

Adivi Sesh Funny Chit chat అడివి శేష్ తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. సోషల్ మీడియాలో తాజాగా అడివి శేష్‌ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టాడు. #ASKSesh అంటూ అడివి శేష్‌ ట్విట్టర్‌లో రెడీ అయ్యాడు. దీంతో నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు సంధించారు. ఒక్కో నెటిజన్‌కు అడివి శేష్‌ ఇచ్చిన రిప్లైలు అదిరిపోయాయి. నీ పెళ్లి ఎప్పుడు అన్నా? అని ఓ నెటిజన్ అడిగాడు. ఇలా అడిగావ్ అంటే.. నీకు కచ్చితంగా పెళ్లి కాలేదు అని అర్థమవుతోందంటూ అడివి శేష్‌ రిప్లై ఇచ్చాడు.

కేడీకి, విక్రమ్ రుద్రకు మధ్యలో ఫైట్ ఉంటుందా? అని ఇంకో నెటిజన్ అడిగాడు. అవును.. కాదు.. తెలియదు.. అయితే నేను ఈ ప్రశ్నను శైలేష్‌ కొలను ఇంకా అడగలేదు అంటూ తప్పించుకున్నాడు అడివి శేష్. అమ్మాయిలకే రిప్లే ఇస్తున్నావ్.. అబ్బాయిలకు ఇవ్వడం లేదు.. పక్షపాతం చూపిస్తున్నావ్ అంటూ అడివి శేష్‌ మీద ఓ నెటిజన్ ఆరోపణలు చేశాడు. బాయ్స్ అయితే.. ఒకరిద్దరి ఫ్రెండ్స్‌తోనే సినిమాకు వెళ్తారు. కానీ అమ్మాయిలు మాత్రం ఫ్యామిలీ మొత్తంతో వెళ్తారు.. అది లెక్కా.. సరదాగా చెప్పాను.. నేను అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తా.. హిట్ 2కి ఎక్కువ బాయ్సే ఫ్యాన్స్ ఉన్నారు అంటూ రిప్లై ఇచ్చాడు.

 

మీరు రిప్లై ఇవ్వకపోతే హిట్ 3లో నువ్వ మ్యాక్స్ (పెట్) కన్నా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉండాలి అని శాపం పెడుతున్నా.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ వేసింది. ఇక నేను వెళ్తున్నాను.. ఇది నాకు నవ్వి తెప్పిస్తోంది.. నిజంగా హిట్ 3లో మ్యాక్స్‌కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ రావాలని కోరుకుంటున్నాను.. ఓకే గాయ్స్.. గుడ్ నైట్ అంటూ అడివి శేష్‌ #ASKSesh సెషన్‌ను ముగించేశాడు.

Also Read : RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా

Also Read : Mahesh Babu Wife : నాలో వేడి పుట్టించండంటోన్న మహేష్‌ బాబు భార్య.. కొత్త లుక్కుతో షాకిచ్చిన నమ్రత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News