Manoj Bajpayee's father RK Bajpayee passes away at 83: బాలీవుడ్‌ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఫేం మనోజ్‌ బాజ్‌పేయి(Manoj Bajpayee) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) ఆదివారం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ(Delhi)లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్(Bollywood) ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: చై-సామ్ విడాకులకు కారణం ఆ స్టార్‌ హీరోనే: కంగనా


బీహార్‌(Bihar)లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్‌ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్(Family man Web Series) తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 



"మనోజ్ భయ్యా తండ్రి ఇక లేరు. అతనితో గడిపిన క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవి మరలా తిరిగి రావు. ఈ చిత్రాన్ని నేను భీతిహర్వ ఆశ్రమంలో తీశాను. ఓర్పు కలిగిన గొప్ప వ్యక్తి అతను. తన కొడుకు విజయానికి ఎల్లప్పుడూ దూరంగా ఉంటూ.. నిరాడంబర జీవితం గడిపేవారు."- అవినాష్​ దాస్​, డైరెక్టర్​


సెప్టెంబర్​లో మనోజ్​ తండ్రి అనారోగ్యం పాలయ్యారు. దీంతో అకస్మాతుగా కేరళ(Kerala) నుంచి దిల్లీ వెళ్లి తండ్రిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. అంతిమసంస్కారాలు దిల్లీలోని నిఘంభోద్​ ఘాట్​లో జరగనున్నాయి.మనోజ్ బాజ్​పాయ్​ చివరిగా వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (Family Man 2) లో కనిపించారు. కమల్ రషీద్ ఖాన్‌పై పరువు నష్టం దావా వేసిన తర్వాత మనోజ్​ వార్తల్లో నిలిచారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి