Chiranjeevi: గత కొద్దిరోజులుగా త్రిష.. మన్సూర్ అలీ ఖాన్ మధ్య జరుగుతున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. త్రిష పైన మన్సూర్ అలీ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేయగా.. దానిపైన త్రిష తో సహా కొంతమంది సెలబ్రిటీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా మన తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిష హీరోయిన్ గా నటించిన ‘లియో’ సినిమాలో మన్సూర్ ఒక ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ రోల్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డాను అంటూ వ్యాఖ్యానించారు. కాకా ఈ వ్యాఖ్యలపైనే చిరంజీవి.. ఇంకా పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.




త్రిషాని సపోర్ట్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ వేశారు చిరు. కాగా ఈ ట్వీట్ పై మన్సూర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ గురించి మాట్లాడుతూ.. మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మెగాస్టార్ అభిమానుల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.


“చిరంజీవి ప్రతి సంవత్సరం లేడీ హీరోయిన్స్ కి పార్టీలు ఇస్తుంటారు. ఆ పార్టీలకు నన్ను ఎప్పుడు పిలువలేదు అనుకోండి. చిరంజీవి కేవలం హీరోయిన్స్ ని మాత్రమే పిలుస్తారు. అది ఆయన ఇష్టం ఎందుకంటే ఆయన పార్టీ కాబట్టి. కానీ నాకు సంబంధించిన ఒక విషయం జరిగినప్పుడు.. అసలు ఏం జరిగిందని ఒకసారి నాకు ఫోన్ చేసి క్లియర్ గా ఆ విషయం తెలుసుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఆయన మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధించాయి” అంటూ చెప్పుకొచ్చారు.




“అంతేకాదు చిరంజీవి పొలిటికల్ పార్టీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు మన్సూర్. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించారు.. కానీ ఆయన ఎప్పుడూ పేదవాళ్ళకి సహాయం చేయలేదు’’ అని చెప్పకు వచ్చారు. కాగా చిరంజీవి, కుష్బూ, త్రిష మీద 20 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు, వచ్చిన డబ్బును మధ్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తానంటూ ప్రకటించారు.


ఇక మన్సూర్ ఆలీ ఖాన్ చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  


 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


 


 


 


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి