Manushi Chhillar Relationship With Nikhil Kamath: మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి అందాల ప్రదర్శన వల్లనో, సినిమా యాక్టింగ్ కెరీర్ వల్లనో కాదు.. ఆమె వ్యక్తిగత లవ్ లైఫ్ కారణంగా హాట్ టాపిక్ అయింది. ఈ పాతికేళ్ల ప్రపంచ సుందరి పెళ్ళై భార్యకు దూరమైన నిఖిల్ కామత్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య గత ఏడాది కాలంగా ఎఫైర్ నడుస్తోందని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మానుషి చిల్లర్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ కామత్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇద్దరి మధ్య ఈ బంధం మొదలై దాదాపు ఒక సంవత్సరం అవుతోందని, అయితే ఇటీవల ఈ ప్రేమ పక్షులు కలిసి రిషికేశ్ చేరుకున్నాయని, అక్కడ కూడా ఇద్దరూ తమ డేటింగ్ వ్యవహారాన్ని లో ప్రొఫైల్‌లోనే ఉంచడానికి ప్రయత్నించారని చెబుతున్నారు.


అయితే ఇద్దరూ కలిసి బయటకీ వెళ్లడం ఇదే మొదటి సారి కాదని, గతంలో కూడా చాలా సార్లు వీరు కలిసి ట్రిప్పులకు వెళ్లారని కూడా చెబుతున్నారు. ఇద్దరి బంధం అయితే చాలా దృఢంగా ఉందని, ప్రస్తుతం మానుషి తన కెరీర్‌పై దృష్టి పెట్టిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరి కుటుంబాలకు, స్నేహితులకు వీరి బంధం గురించి తెలుసు అని కూడా చెబుతున్నారు. కామత్‌కు ఇంతకు ముందే పెళ్లి కూడా అయ్యిందని అంటున్నారు. జెరోధా సహవ్యవస్థాపకుడు అయిన కామత్ 2019 సంవత్సరంలో ఇటలీలో అమండా అనే మహిళను గ్రాండ్ గా వివాహం చేసుకున్నాడు.


అయితే, ఇద్దరూ ఎందుకుకానీ త్వరలోనే దూరమై 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక మానుషి అక్షయ్ కుమార్‌తో కలిసి 'సామ్రాట్ పృథ్వీరాజ్' చిత్రంలో కనిపించింది, ఇందులో ఆమె క్వీన్ సంయోగిత పాత్రలో నటించింది.  అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్లాప్‌గా నిలిచింది. నిజానికి మానుషి చిల్లర్ ఇటీవల సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయబడింది. ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డ్ ఫంక్షన్‌కు నటి చాలా స్టైలిష్ గా హాజరైంది. ఆమె ఎల్లో డీప్ నెక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్ వేసుకుంది. అయితే ఆమె బోల్డ్ లుక్ కొంతమందికి నచ్చలేదు, అందుకే మానుషిని దారుణంగా ట్రోల్ చేశారు. 


Also Read: Sneha Reddy Copies : అతన్ని నమ్మి మోసపోయిన అల్లు అర్జున్ భార్య.. నిండా మునిగిందిగా!


Also Read: Comments on Samantha: సమంతకు అట్రాక్ట్ అయిన యంగ్ హీరో.. భార్య మాస్ వార్నింగ్ దెబ్బకు సైలెంట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook