Raviteja: మాస్ మహారాజాగా ప్రాచుర్యం పొందిన రవితేజ పరిస్థితి ఏంటి..సరైన హిట్ లేక..నీరసపడ్డాడా. అభిమానులైతే కచ్చితంగా డీలా పడ్డారు. అందుకే న్యూ ఇయర్ నాడు అభిమానులకు సర్‌ప్రైజింగ్ ఇవ్వబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాజా ది గ్రేట్ చిత్రం ( Raja the great movie ) తరువాత ఒక్క విజయాన్ని కూడా సాధించ లేకపోయిన మస్ మహారాజా రవితేజ ( Mass Maharaja Raviteja ) కొత్త యేడాది సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. వరుస సినిమాలు చేసినా..విజయం మాత్రం అందని ద్రాక్షగా మారింది రవితేజకు. సరైన హిట్ లేకపోవడంతో ఇటు అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంతో క్రాక్ ( Crack movie ) సినిమా చేస్తున్న రవితేజ ..పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించబోతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా క్రాక్ ఎక్కిస్తాడా లేదా ఇది కూడా ఫ్లాప్ ఖాతాలో వెళ్లిపోతుందా అనేది చూడాలి. 


రవితేజ ( Raviteja ) మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. గోపిచంద్ మలినేనితో గతంలో రవితేజ..డాన్ శీను, బలుపు వంటి హిట్స్ కొట్టాడు. జనవరి 1న నూతన సంవత్సర కానుకగా అభిమానులకు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. అదే ఈ క్రాక్ సినిమా ట్రైలర్ లాంచ్ ( Crack movie trailer launch ). 


మాస్ కా బాప్ క్రాక్ ట్రైలర్ ( Mass ka Baap crack trailer ) అంటూ ప్రమోట్ చేస్తున్నారు క్రాక్ ట్రైలర్‌ని. జనవరి 1న ఉదయం 11 గంటలకు క్రాక్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్ సాహిత్యాన్ని అందించగా..జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నాడు. సంక్రాంతి నాడు సినిమా ధియేటర్లలో విడుదల కానుంది. తమిళ బ్లాక్‌బస్టర్ సేతుపతి ( Sethupati ) ఆధారంగా సినిమా నిర్మించారు. 


Also read: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు