Mechanic: సమాజానికీ ఉపయోగపడే మెకానిక్ లాంటి సినిమాలు రావాలి.. మంత్రి కోమటిరెడ్డి ఇంట్రెస్ట్ కామెంట్స్..
Mechanic - Komatireddy Venkat Reddy: కొత్త నటీనటులతో టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం `మెకానిక్`. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసారు. అంతేకాదు సినిమాపై ప్రశంసలు కురిపంచారు.
Mechanic - Komatireddy Venkat Reddy: అంతా కొత్తవాళ్లతో తెరెక్కిన చిత్రం 'మెకానిక్'. సామాజిక అంశాలు ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చిత్ర యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమానికి నిర్మాత, నటులు డి.యస్.రావ్, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోo’ దర్శకుడు మోహన్ ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీడియో బైట్ ద్వారా తన సందేశాన్ని అందిచ్చారు.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ...
నల్లగొండ జిల్లా ముందునుంచి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. ఇక్కడ ఎంతోమంది జీవితాలు ఈ ఫ్లోరైడ్ నీటి వల్ల నాశనం అయ్యాయి. రాబోయె రెండేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేస్తాము. ఈ ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని, సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ వంటి సినిమాలను ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ సినిమా ద్వారా సమాజానికి ఈ సమస్య, బాధితుల బాధలు అర్ధమవుతాయన్నారు. అందరు థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాని చూడాల్సిందిగా కోరారు. ఈ చిత్రం తప్పకుండా మoచి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
డి.యస్. రావు మాట్లాడుతూ...
సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఒక చిన్ని సినిమా పాటలు టి`సీరీస్ వారు తీసుకోవడంతోనే పెద్ద విజయం సాధించారు. దర్శక, నిర్మాతలు...అలాగే మంచి మెసేజ్‌కూడా ఉండటం ఈ సినిమా విజయానికి హెల్ప్ అవుతుంది. ‘మెకానిక్’ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ అందరికీ అభినందనలు చెపుతున్నా' అనారు.
‘శ్రీకాకుళం షెర్లాక్స్’ దర్శకుడు మోహన్ మాట్లాడుతూ...
మంచి ప్యాషన్ ఉన్న దర్శక, నిర్మాతలు రూపొందించిన మెకానిక్ మూవీ ఇప్పటికే ఆడియో పరంగా సూపర్‌హిట్ అయింది. సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.
నిర్మాత మున్నా మాట్లాడుతూ...
మా సినిమా ఆడియో మా అంచనాలను దాటి పెద్ద హిట్ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో అన్ని కమర్షియల్ అంశాలూ ఉన్నాయన్నారు. మా సహ నిర్మాతలు నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండరాశి ఉపేందర్‌ల సహకారం మరవలేనిది. వారికి నా థ్యాంక్స్. దర్శకుడు ముని సహేకర మల్టీ టాలెంటెడ్. మంచి పర్‌ఫెక్షన్, విజన్ ఉన్న దర్శకుడు, రచయిత. బ్లాక్‌బస్టర్ సంగీతం ఇచ్చిన సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు ముని సహేకర మాట్లాడుతూ...
మంచి చిత్రం రావాలంటే మంచి నిర్మాత దొరకాలి. నాకు మంచి నిర్మాతలే కాదు.. గట్స్ ఉన్న నిర్మాతలు దొరికారు. దేనికి ఎంత అవుతోంది అని ఆలోచించకుండా ఖర్చుపెట్టారు. వినోద్ యాజమాన్యగారు పాటల విషయంలో తన స్వంత సినిమా అన్నట్టుగా ప్రాణం పెట్టి పనిచేశారు. తన రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా మంచి పాటలు రావటానికి మాచేత ఖర్చు పెట్టించారు.
హీరో మణి సాయితేజ, హీరోయిన్- రేఖ నిరోషాలు మాట్లాడుతూ.. తమను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత మున్నా గారికి, దర్శకుడు ముని సహేకర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మా సినిమా ఆడియో ఇంత సూపర్ సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమా కూడా ఇలాగే సూపర్ సక్సెస్ అవుతుంది. దర్శకుడు ముని గారి టాలెంట్‌కు హేట్సాఫ్. ఆయన చెప్పినదానికన్నా బాగా తెరకెక్కించారు. యూనిట్ అందరికీ మా థ్యాంక్స్' అన్నారు.
Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి