Meenakshi Chaudhary: సీనియర్ హీరోతో జోడి కట్టనున్న మీనాక్షి చౌదరి…ఏకంగా ఆ హిట్ జోడితో..
Meenakshi Upcoming Movies: ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అల్లరించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. కాగా ప్రస్తుతం వరస అవకాశాలు అందుకుంటున్న ఈ హీరోయిన్ ఒక సీనియర్ హీరో సినిమాకి ఓకే చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Meenakshi Chaudhary: ఖిలాడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆ తరువాత వచ్చిన హిట్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో సైతం ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే గుంటూరు కారంలో మీనాక్షికి పెద్ద ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె అభిమానులు తెగ హర్ట్ అయ్యారు.
ఇక వారు ఈ బాధ నుంచి బయటపడక ముందే ఇప్పుడు మరో పెద్ద షాక్ ఇచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం మీనాక్షికి తమిళంలో వరస అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అవుతుందేమో అని అందరూ అనుకుంటూ.. ఉండగా మీనాక్షి మాత్రం సీనియర్ హీరో సినిమాకి ఓకే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ మధ్యనే ఉగాది కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025 సంక్రాంతికి రాబోతుంది. ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీసాఫీసర్ అని, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక భార్య ఉంటుందని సినిమా అనౌన్స్ చేస్తూ తెలిపారు. ఇక ఆపద నుంచి ఇందులో వెంకటేష్ కి భార్యగా ఎవరు నటిస్తారో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఎవరు నటిస్తారో అనే సస్పెన్స్ మొదలైంది.
తాజాగా ఈ రెండు పాత్రలలో ఒక పాత్రకి మీనాక్షి చౌదరి ని సినిమా యూనిట్ తీసుకున్న ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమిళంలో తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న టైంలో మీనాక్షి సీనియర్ హీరో సరసన జోడిగా ఒప్పుకుంది అన్న వార్త కొంచెం ఆమె అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. సీనియర్ హీరోతో నటించడం వల్ల మీనాక్షి తదుపరి సినిమాలపై ప్రభావం ఉండవచ్చని.. ఇకపై కూడా యువ హీరోల సరసన కాకుండా సీనియర్ హీరోల సరసన నటించడం కోసం నిర్మాతలు మీనాక్షిని సంప్రదించవచ్చని.. దానివల్ల ఆమె కెరియర్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. ఒకరు వెంకటేష్ భార్య పాత్రలో, మరొకరు మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించనున్నారు. ఒక హీరోయిన్ గా మీనాక్షిని తీసుకుంటే మరి వెంకీమామ సరసన నటించే ఇంకో భామ ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..
Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్.. హెలికాప్టర్ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter