Tillu Sqaure: టిల్లు స్క్వేర్ వెనుక మ్యాడ్ యాక్టర్ మాస్టర్ మైండ్.. ఇంతకీ అతను ఎవరంటే!
Tillu Square Review : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ వారం విడుదల అయిన టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను కలెక్షన్ల తో షేక్ చేస్తోంది. సీక్వెల్ అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. కానీ అసలు టిల్లు స్క్వేర్ స్క్రిప్ట్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా?
Tillu Square Collections:
డీజే టిల్లు సినిమా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా వచ్చి ఈ చిత్రం ఎంత భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ వారం విడుదల అయిన టిల్లు స్క్వేర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కాకుండా అటు ఓవర్సీస్ లో సైతం టిల్లు స్క్వేర్ థియేటర్లను హౌస్ ఫుల్ చేస్తూ భారీ స్థాయిలో వసూళ్లు చేస్తోంది. అన్నీ చోట్లా ఈ చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది. విడుదల అయిన మొదటి రోజు రూ.25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టి ఈ సినిమా ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది.
ఇక వారాంతం లో కూడా టిల్లు స్క్వేర్ కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. మౌత్ టాక్ కూడా బాగుండటం సినిమా కి చాలా బాగా ఉపయోగపడింది. డీజే టిల్లు లాగానే టిల్లు స్క్వేర్ సినిమాకి కూడా హీరో సిద్ధు జొన్నలగడ్డ రైటర్ గా కూడా పనిచేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాకు సిద్దు ఒక్కడే రచయిత కాదు.
టిల్లు పాత్ర ఇంత బాగా పండడం వెనుక, సినిమాకి ట్రెండీ డైలాగ్స్ ఇవ్వడం వెనుక మాస్టర్ మైండ్ ఇంకొకరు ఉన్నారు. ఆ రైటర్ రవి ఆంటోనీ. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ మ్యాడ్ సినిమా చూసిన వాళ్లంతా అతనిని గుర్తు పట్టేస్తారు. అందులో ఆంటోనీ అనే పాత్రలో ట్యూబ్ లైట్ పట్టుకుని తిరుగుతూ ఉండే నటుడు మరెవరో కాదు రవి ఆంటోనీనే.
ఆ సినిమాలో నటుడిగా అలరించిన రవి అంతకు ముందే సిద్ధు జొన్నలగడ్డతో చేతులు కలిపి డీజే టిల్లు స్క్రిప్టు రాశాడు. అతనే మళ్ళీ టిల్లు స్క్వేర్ కి కూడా పనిచేశాడు. అతను రాసిన స్క్రిప్ట్ అలానే ఈ సినిమాలో అతను రాసిన డైలాగ్స్ మళ్లీ ఈ చిత్రం ఇంతటి భారీ విషయం సాధించిందని చాలామంది చెబుతున్నారు. ఈ సినిమా విజయం వెనక సిద్దు కష్టం ఎంత ఉందో ఈ రైటర్ కష్టం కూడా అంతే ఉందట.
ఇక టిల్లు స్క్వేర్ కూడా భారీ స్థాయిలో హిట్ అయిపోవడం తో టిల్లు 3 సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. మరి టిల్లు 3 స్క్రిప్ట్ కూడా వీరు త్వరలోనే ప్రారంభించనున్నారు అని వినికిడి.
Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక
Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook