Ram Charan wife receives UAE Golden Visa: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన యూఏఈ గోల్డెన్ వీసాను ఆమె సొంతం చేసుకున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ బహుమతి అందుకున్నట్లుగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవల దుబాయ్ 2020 ఎక్స్‏పోను (India Expo 2020) ఉపాసన సందర్శించి అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కలిశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''ప్రపంచమంతా ఒకే కుటుంబం. యూఏఈ గోల్డెన్ వీసా పొందడం సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని. నేను అధికారికంగా ప్రపంచ పౌరురాలిని'' అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.




Also Read: Rajamouli Mahabharatam: రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్ట్ 'మహాభారతం'లో ఆ ఇద్దరి హీరోలు ఫిక్స్!


యూఏఈ గోల్డెన్ వీసాను (UAE Golden Visa) కళలు, క్రియేటివిటి, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్ విద్య వంటి రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్చగా నివాసం ఉండేందుకు వీలుంటుంది. వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. అక్కడి ప్రభుత్వం 2019 నుంచి ఈ వీసాలు జారీ చేస్తుంది. ఈ గోల్డెన్ వీసా పొందిన వారిలో సినిమా రంగం నుంచి..బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, సౌత్ బ్యూటీ త్రిష కృష్ణన్, నిర్మాత బోనీ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మలయాళ స్టార్ మోహన్ లాల్ మరియు మమ్ముట్టి ఉన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook