Video: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్.. చిన్నపిల్లాడిలా వరుణ్‌తో గొడవపడ్డ చిరు...
Mega Family Bhogi celebrations: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.
Mega Family Bhogi celebrations: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇరువురు కలిసి భోగి వేడుకలు జరుపుకుంటున్న వీడియోను తాజాగా వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిరు, వరుణ్ తేజ్ కలిసి దోసెలు వేస్తున్న సీన్ భలే ఫన్నీగా ఉంది. తన కంటే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో చిరు చిన్నపిల్లాడిలా అతనితో గొడవపడ్డారు.
పాపం చిరు వేసిన దోసె పెనానికి అతుక్కుపోయింది. పక్కనే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో.. 'నాకు కుళ్లు వచ్చేసింది..' అంటూ చిరు చిన్నపిల్లాడిలా గొడవపడే ప్రయత్నం చేశారు. వరుణ్ వేసిన దోసెను గరిటెతో చెడగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇద్దరి మధ్య సరదా గొడవ ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన కాసేపటికే లక్ష పైచిలుకు వ్యూస్‌తో ఈ వీడియో వైరల్‌గా మారింది.
గతేడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో (Sankranti 2022 Celebrations) హీరో నాగార్జున కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లతో సందడి వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి పండగ జరుపుకుంటున్నారు. ఇక అటు నందమూరి బాలకృష్ణ కుటుంబం ఈసారి సంక్రాంతి వేడుకలకు కారంచేడు వెళ్లారు. సోదరి పురందేశ్వరి, బావ వెంకటేశ్వరరావుల ఇంట్లో ఈసారి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.
Also Read: Nandamuri Balakrishna: ఈసారి బాలయ్య సంక్రాంతి వేడుకలు ఎక్కడంటే..అక్కడికి క్యూ కట్టిన ఫ్యాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook