Nandamuri Balakrishna: ఈసారి బాలయ్య సంక్రాంతి వేడుకలు ఎక్కడంటే..అక్కడికి క్యూ కట్టిన ఫ్యాన్స్

Nandamuri Balakrishna Sankranti Celebrations: సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు సంక్రాంతి పండగ కోసం ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లారు. తన సోదరి పురందేశ్వరి, బావ వెంకటేశ్వరరావుల ఇంట్లో ఈసారి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 11:39 AM IST
  • సంక్రాంతి వేడుకలకు కారంచేడు వెళ్లిన బాలయ్య దంపతులు
  • సోదరి పురందేశ్వరి ఇంట్లో భోగి, సంక్రాంతి వేడుకలు
  • వేడుకల్లో జయకృష్ణ, లోకేశ్వరి, ఉమా మహేశ్వరి కుటుంబాలు
Nandamuri Balakrishna: ఈసారి బాలయ్య సంక్రాంతి వేడుకలు ఎక్కడంటే..అక్కడికి క్యూ కట్టిన ఫ్యాన్స్

Nandamuri Balakrishna Sankranti Celebrations: సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు సంక్రాంతి పండగ కోసం ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లారు. తన సోదరి పురందేశ్వరి, బావ వెంకటేశ్వరరావుల ఇంట్లో ఈసారి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.

బాలకృష్ణ-వసుంధరలతో పాటు, జయకృష్ణ, లోకేశ్వరి, ఉమా మహేశ్వరి సహా పలువురు బంధువులు వేడుకల్లో పాల్గొంటున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండటంతో... ఈసారి నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలు ఒకేచోట సంక్రాంతి జరుపుకుంటున్నారు.

బాలకృష్ణ కారంచేడు వచ్చారనే విషయం తెలియగానే చాలామంది ఆయన్ను చూడటానికి పురందేశ్వరి-వెంకటేశ్వరరావుల నివాసానికి క్యూ కట్టినట్లు తెలుస్తోంది.

అయితే కరోనా కారణంగా ఎవరినీ లోపలికి అనుమతించట్లేదని సమాచారం. చివరిసారిగా, 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం కుప్పంలో నారా, నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

సినిమాల విషయానికి వస్తే.. అటు 'అఖండ' బ్లాక్ బస్టర్ హిట్, ఇటు ఆహా 'అన్‌స్టాపబుల్' షో సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణ (Nandamuri Balakrishna) మంచి జోరు మీద ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'అఖండ' సినిమాకు ఇప్పటికీ వసూళ్ల వర్షం కురుస్తోంది.

ప్రస్తుతం సంక్రాంతి బరిలో 'బంగార్రాజు' సినిమా తప్ప పెద్ద సినిమాలేవీ లేకపోవడం అఖండకు మరింత కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా జనవరి 21న ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇక బాలయ్య 'అన్‌స్టాపబుల్' షో దేశంలోనే టాప్-3 టాక్ షోగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు.

Also Read: Archana Gautam: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. మిస్ బికినీకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్! సౌత్ సన్నీ లియోన్‌గా ఫెమస్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News