Mega Fan Satires on Nandamuri Balakrishna సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి అభిమానుల మధ్య ఉండే దూరాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. ఎంత బాలయ్య, చిరు కలిసి కనిపించినా, ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి మెలిసి తిరిగినా అభిమానుల మధ్య ఉండే దూరం మాత్రం తగ్గదు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. చిరంజీవి ఎవరు? అంటూ నాడు ఎన్టీఆర్ అన్న మాటలు, పవన్ కళ్యాణ్‌ పేరు కూడా తెలీదంటూ బాలయ్య చెప్పిన మాటలు అభిమానులు అంత ఈజీగా ఏమీ మర్చిపోరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం పవన్ కళ్యాణ్‌ వచ్చాడు. సెట్‌లో పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య ఎదురుచూశాడు. అయితే ఇదే విషయాన్ని ఓ మెగా ఫ్యాన్ ట్వీట్ వేశాడు. పేరు తెలీదు అన్నోడే పడిగాపులు కాసేలా చేశావ్ కదా? అంటూ పవన్ కళ్యాణ్‌ మీద ట్వీట్ వేశాడు. దీంతో నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు.


అలా మళ్లీ మెగా వర్సెస్ నందమూరి అన్నట్టుగా సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. మరీ ఇంతలా ఉన్నారేంట్రా బాబు. అది ఒక ప్రోగ్రాం ఒకరు హోస్ట్ ఇంకోరు గెస్ట్ దానికి వెయిట్ చెయ్యటం ఏంటో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అది బాలయ్య బాబు గొప్పతనం, దీనిని అలుసుగా తీసుకోవద్దు, ఇటువంటి  ట్వీట్స్ పెట్టకూడదు అంటూ బాలయ్య గురించి మరో నెటిజన్ ట్వీట్ వేశాడు.


హిందూపురం ఎమ్మెల్యేని కలిసిన డిపాజిట్ రాని కళ్యాణ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి మరోసారి మెగా నందమూరి అభిమానులు మాత్రం ఇలా బాహాటంగానే తిట్టేసుకుంటున్నారు. ఇలా నందమూరి, మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా పోట్లాడుతూనే ఉండేలా కనిపిస్తోంది. ఇక సంక్రాంతి బరిలో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి. వీర సింహా రెడ్డి గెలుస్తుందా? వాల్తేరు వీరయ్య దుమ్ములేపుతాడా? అన్నది చూడాలి.


Also Read : Samyuktha Hegde Bikini : బికినీలో బెంబేలెత్తిస్తోంది.. సంయుక్త సొగసులు.. కుర్రాళ్లు తట్టుకోగలరా?


Also Read : Pawan Kalyan in Unstoppable : షూట్ మొదలెట్టేసిన బాలయ్య, పవన్ కళ్యాణ్‌.. ఫోన్‌ కాల్‌లో ఆ మెగా హీరో సందడి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook