Pawan Kalyan in Unstoppable : షూట్ మొదలెట్టేసిన బాలయ్య, పవన్ కళ్యాణ్‌.. ఫోన్‌ కాల్‌లో ఆ మెగా హీరో సందడి

Pawan Kalyan in Unstoppable పవన్ కళ్యాణ్ బాలయ్య కలిసి అన్ స్టాపబుల్ షోకు షూటింగ్ చేయబోతోన్నారు. కాసేపటి క్రితమే షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతోందని సమాచారాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 12:02 PM IST
  • అన్ స్టాపబుల్ సెట్‌లోకి పవన్ కళ్యాణ్
  • బాలయ్యతో పవర్ స్టార్ ముచ్చట్లు
  • అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య, పవన్ కళ్యాణ్‌
Pawan Kalyan in Unstoppable : షూట్ మొదలెట్టేసిన బాలయ్య, పవన్ కళ్యాణ్‌.. ఫోన్‌ కాల్‌లో ఆ మెగా హీరో సందడి

Pawan Kalyan in Unstoppable నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ప్రారంభం అదిరింది. అయితే మధ్యలో రాజకీయ నాయకులని పట్టుకురావడంతో కాస్త చప్పగా నడిచింది. పూర్తిగా రాజకీయ టాక్ షో అవుతోందనే కామెంట్లు వచ్చాయి. దీంతో ఆహా టీం మళ్లీ తమ ఆలోచనలకు పదును పెట్టింది. ఎవరిని పట్టుకొస్తే బాగుంటుందనే ఆలోచనలు చేసింది. దీంతో నేషనల్ డార్లింగ్ ప్రభాస్‌ను పట్టుకొచ్చారు. ఒక్కసారిగా షో మీద హైప్ పెంచేశారు.

అయితే ఫస్ట్ సీజన్‌ను మహేష్ బాబు ఎపిసోడ్‌తో ముగించారు. రెండో సీజన్‌ను ఎవరితో ముగిస్తారా? అని అంతా అనుకున్నారు. చివరకు పవన్ కళ్యాణ్‌ను పట్టుకొచ్చేశారు. మామూలుగా అయితే చిరంజీవి బాలయ్య ఎపిసోడ్ ఉంటుందని అంతా భావించారు. కానీ చిరంజీవి బదులు పవన్ కళ్యాణ్‌ను ఆహా టీం రంగంలోకి దించింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

నేడు బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ జరగనుంది. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన సెట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ బాలయ్య ఎపిసోడ్ న్యూ ఇయర్ స్పెషల్‌గా రాబోతోంది.

సంక్రాంతి స్పెషల్‌గా బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రానుందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌తో ఈ రెండో సీజన్ ముగుస్తుందని తెలుస్తోంది. మరి మూడో సీజన్‌లో అయినా వెంకీ, నాగ్, చిరు వంటి వారు బాలయ్యతో సందడి చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Singer Chinmayi Video : న్యూడ్ ఫోటో లీక్ చేస్తానంటూ బెదిరింపులు.. చిన్మయి వీడియో వైరల్

Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News