Gandeevadhari Arjuna Teaser: హాలీవుడ్ స్థాయిలో `గాండీవధారి అర్జున` టీజర్.. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన వరుణ్..

Gandeevadhari Arjuna Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Gandeevadhari Arjuna Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో వస్తున్న సినిమా 'గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna). స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా చేజింగ్ సీన్స్, బ్లాస్టింగ్ ఎలిమెంట్స్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. సాక్షి కూడా స్పైగానే నటించిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అంతేకాకుండా ఈ ప్రచార చిత్రంలో లక్షల వ్యాపారం చుట్టూ జరిగే స్కామ్ ను కూడా చూపించారు.
మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీని ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ తరహా కాన్సెప్ట్స్ ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా ఆడలేదు. ఏజెంట్, నిఖిల్ స్పై వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. అయితే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఇది వరకే ఇలాంటి ప్రాజెక్ట్సును డీల్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇతడు రాజశేఖర్ తో చేసిన గరుడవేగ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
Also Read: Tollywood: హిట్ లేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ యంగ్ హీరోలు వీరే..!
త్వరలోనే వరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వరుణ్-లావణ్య వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ప్రస్తుతం ఈ జంట షాపింగ్ కోసం విదేశాలకు చెక్కేసింది. వీరు పారిస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Also Read: Tamannaah: తమన్నాకు రూ.2 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ఉపాసన.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook