Chiranjeevi: జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్న చిరంజీవి.. నేడు మరో సినిమా అనౌన్స్‌మెంట్! క్రేజీ కాంబో!!
యువ దర్శకుడు వెంకీ కుడుముల కథ మెగాస్టార్` చిరంజీవికి బాగా నచ్చిందని, అతడితో సినిమాకు ఓకే చెప్పారని తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు చిరు 156వ ప్రాజెక్ట్‌గా వెంకీ కుడుముల సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని ఫిల్మ్ నగర్ టాక్.
Mega Star Chiranjeevi's 156 Film Official Announcement Today: టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్లతో టాలీవుడ్ (Tollywood)ని మరో స్థాయికి తీసుకెళ్లారు. తన నటన, డాన్స్‌తో ఎందరో అభిమానులను సంపాదించారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే.. 2007లో వచ్చిన 'శంకర్ దాదా జిందాబాద్' సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వచ్చారు. 2017లో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి.. తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది.
2019లో వచ్చిన సైరా నర్సింహారెడ్డి కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. చిరంజీవి (Chiranjeevi) ఆరు పదుల వయస్సులోను వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాలు పడుతూ వచ్చి చివరకు ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య ఇంకా విడుదల కాకముందే.. గాడ్‌ఫాదర్, భోళా శంకర్ సినిమాలను చేస్తున్నారు. బాబి సినిమా కూడా రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. మారుతితో కూడా చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని ఇటీవల నెట్టింట వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. యువ దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) కథ మెగాస్టార్' చిరంజీవి (Chiranjeevi)కి బాగా నచ్చిందని, అతడితో సినిమాకు ఓకే చెప్పారని తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు చిరు 156వ ప్రాజెక్ట్‌గా వెంకీ కుడుముల సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని ఫిల్మ్ నగర్ టాక్. 'ఆర్ఆర్ఆర్' సినిమాని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna)ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే నిజమైతే క్రేజీ కాంబో కానుంది. ఇప్పటివరకు రష్మిక సీనియర్ హీరోలతో జతకట్టలేదు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఛలో, భీష్మ లాంటి సినిమాలతో వెంకీ మంచి హిట్లు కొట్టిన విషయం తెలిసిందే.
Also Read: సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook