Pakistan vs West Indies: టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన పాకిస్తాన్! గత రికార్డు కూడా పాక్‌దే!!

టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 మ్యాచులు గెలిచిన జట్టుగా పాక్ నిలిచింది. పాకిస్తాన్ ఈ ఏడాది మొత్తం 18 టీ20 మ్యాచ్‌లు గెలుపొంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 02:07 PM IST
  • టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
  • ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 విజయాలు
  • హసరంగా డి సిల్వా పేరుపై అత్యధిక వికెట్లు
 Pakistan vs West Indies: టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన పాకిస్తాన్! గత రికార్డు కూడా పాక్‌దే!!

PAK vs WI: Pakistan go past their own record of 17 wins in a Single Calendar Year: టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ (Pakistan) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌ (Single Calendar Year)లో అత్యధిక టీ20 మ్యాచులు గెలిచిన జట్టుగా పాక్ నిలిచింది. పాకిస్తాన్ ఈ ఏడాది మొత్తం 18 టీ20 మ్యాచ్‌లు గెలుపొంది. కరాచీ వేదికగా సోమవారం వెస్టిండీస్‌ (West Indies)తో జరిగిన తొలి టీ20లో 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో పాక్ ఈ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు 2018లో అత్యధికంగా 17 టీ20లు గెలుపొందిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు దాన్ని తిరగరాసింది. తాజా విజయంతో పాక్ తన రికార్డును తానే బ్రేక్‌ చేసింది.

ఇక టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ హసరంగా డి సిల్వా పేరుపై ఉంది. 2021లో ఇప్పటివరకు హసరంగా 20 మ్యాచులో 36 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ లెగ్ స్పిన్నర్‌ తబ్రెయిజ్‌ షంసీ కూడా ఈ ఏడాది 36 వికెట్లు తీశాడు. అయితే షంసీ 22 మ్యాచులలో 36 వికెట్లు పడగొట్టాడు. ఉగాండాకు చెందిన దినేష్ నక్రానీ 31 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై 2018 ఒక క్యాలెండర్ ఇయర్‌లో 31 వికెట్లు పడగొట్టారు. అతడి రికార్డును ఈ ఏడాది హసరంగా, షంసీ బద్దలు కొట్టారు.

Also Read: Radhe Shyam Song Teaser: రాధేశ్యామ్ నుంచి మరో సర్ ప్రైజ్.. 'సంచారి' సాంగ్ టీజర్ చూశారా?

కరాచీ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ (Pakistan) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మొహ్మద్ రిజ్వాన్‌ (78; 52 బంతుల్లో 10x4), హైదర్‌ అలీ (68; 39 బంతుల్లో 6x4, 4x6) హాఫ్ సెంచరీలు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో నవాజ్‌ (30; 10 బంతుల్లో 3x4, 2x6) ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ (West Indies) 19 ఓవర్లకు 137 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్‌ షాయ్‌హోప్‌ (31; 26 బంతుల్లో 4x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్ షాబాద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. 

Also Read: Ileana D' Cruz: వైట్ బికినీలో హాట్ బ్యూటీ...ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఇలియానా లేటేస్ట్ పిక్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News