Megabrothers Emotional: తండ్రి సంవత్సరీకం.. నాగబాబు, చిరు ఎమోషనల్!
Megabrothers became Emotional : మెగా బ్రదర్స్ తండ్రి వెంకట్రావు సంవత్సరీకం కావడంతో వారంతా ఆయనకు నివాళులు అర్పిస్తూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు.
Megabrothers became Emotional on thier Father Venkat Rao's Death Anniversary: ఈరోజు మెగా బ్రదర్స్ తండ్రి వెంకట్రావు సంవత్సరీకం కావడంతో వారంతా ఆయనకు నివాళులు అర్పించారు. ముందుగా చిరంజీవి మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ ఒక ట్వీట్ చేయగా ఆ తరువాత నాగబాబు కూడా ఒక సుదీర్ఘ లేఖ రాశారు.
తన రెక్కలు ముక్కలు చేసి రేయి పగలు కష్టపడి పిల్లల భవిష్యత్తునే తన భవిష్యత్తుగా చూసుకుంటూ ఒక అందమైన బాధ్యతను నెత్తిన పెట్టుకొని మోసేవాడే నాన్న అని నాగబాబు పేర్కొన్నారు. నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటేనే ఒక భరోసా అని నాన్న అంటేనే మనం యుద్ధాన్ని చెయ్యడానికి తనను కవచంగా మార్చుకొని మన యుద్ధానికి అందించే కొండంత అండ అంటూ ఆయన రాసుకొచ్చారు. నాన్న అనేవాడు మనం జీవితంలో పెరిగి పెద్దవ్వడానికి మనకి ఒక వృక్షం లాంటివాడు.
నాన్న అనేవాడు పరి పూర్ణమైన ఒక ప్రేమ, నాన్న అనేవాడు ఒక అత్యంత కఠినమైన క్రమశిక్షణతో కూడిన పాటలను నేర్పించే ఒక గురువు అంటూ నాగబాబాయ్ ఎమోషనల్ అయ్యారు. హనుమంతుని శక్తి ఎవరో గుర్తుచేస్తే కానీ తెలియదు అన్నట్టు... మన శక్తి ఎప్పుడు పక్కన వుండి గుర్తు చేస్తూ నువ్వు చేయగలవు, నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని నింపే శ్రీరాముడు నాన్న, నాన్న అనేవాడు మన కష్టాలు బాధల్లో ఉన్నప్పుడు తన గుండెల్లో మనల్ని హత్తుకుని ఓదార్చే ఒక ఓదార్పు అంటూ ఆయన రాసుకొచ్చారు. నాన్న పై వన్నీ మాకు నువ్విచావు ... ఈరోజు మేము ఇలా బ్రతుకుతున్నాము ఇంత మందితో పోరాడుతున్నాము, ఇంతమంది మమ్మల్ని అభిమానిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం అని నాగబాబు పేర్కొన్నారు.
నువ్వు మమ్మల్ని పెంచిన విధానం మరియు మాపై చూపించిన ప్రేమ., ఆ ప్రేమను నలుగురికి పంచడానికి చూపించిన దారి. ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి అని నేర్పించిన విధానం నువ్విచ్చిన శక్తీ మూలంగానే ఈరోజు మేము ఇక్కడ ఇలా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. థాంక్ యు నాన్న మాకు ఈ జన్మకు నాన్న అయ్యావు మా మరో జన్మలో నీకు నాన్న అయ్యి నీ రుణం తీసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read: Coffee Hair Pack For Long Hair: ఈ మూడు చిట్కాలు పాటిస్తే జుట్టు సమస్యలు ఏవైనా శాశ్వతంగా దూరమవడం ఖాయం..
Also Read: Tunisha Sharma Suicide: సహనటుడి మేకప్ రూంలో 20 ఏళ్ల సినీ నటి సూసైడ్.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.