Chiranjeevi 154 Movie Poster: సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి జోరు చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు. 'ఆచార్య' షూటింగ్​ ఇప్పటికే పూర్తి చేసిన చిరు.. 'గాడ్​ఫాదర్', 'భోళా శంకర్' చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్​ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 154వ సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా సినిమాలోని చిరంజీవి లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. మాస్ లుక్ లో చిరంజీవి ఆకట్టుకునే విధంగా ఉన్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#MEGA154 వర్కింగ్ టైటిల్​తో తీస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్.. జాలరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య' టైటిల్​ పరిశీలనలో ఉంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.


Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ 


Also Read: KL Rahul: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా ఓపెనర్..వైరల్ గా మారిన ఫోటో.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి