Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ

Mumbai Cruise Drug Case: ముంబయి డ్రగ్స్​ కేసులో (Drugs-On-Cruise Probe) కీలక అధికారిగా ఉన్న సమీర్​ వాంఖడేను (Sameer Wankhede News) విచారణ నుంచి తప్పించింది ఎన్​సీబీ. సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణను నుంచి తప్పిస్తున్నట్లు ఎన్‌సీబీ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనితోపాటు మరో ఐదు హై-ప్రొఫైల్‌ కేసుల నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 08:24 AM IST
Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ

Mumbai Cruise Drug Case: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో (Mumbai Cruise Drug Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను (Sameer Wankhede NCB Officer) తప్పించింది. ఆయనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణను నుంచి తప్పిస్తున్నట్లు ఎన్‌సీబీ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ ముంబయి జోన్‌ ఆర్యన్‌ ఖాన్‌ కేసును విచారిస్తుండగా.. ఇకపై ఎన్‌సీబీ సెంట్రల్‌ యూనిట్‌ దర్యాప్తు (NCB Drug Investigation) చేపట్టనుంది. ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఐదు కేసులను సెంట్రల్‌ యూనిట్‌కు బదలాయించారు. ఈ కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్‌ సింగ్‌ విచారించనున్నారు.

ప్రస్తుతం ముంబయి జోనల్‌ అధికారిగా ఉన్న వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యోగం కోసం డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని, బోగస్‌ డ్రగ్స్‌ కేసుల్లో పలువురిని అరెస్ట్‌ చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కేసు నుంచి వాంఖడేను తప్పించటంపై స్పందించిన నవాబ్‌ మాలిక్‌ (Nawab Malik On Sameer Wankhede) ఇది ఆరంభం మాత్రమే అని ట్వీట్‌ చేశారు.

‘విచారణ నుంచి తొలగించలేదు..’

మరోవైపు ఈ నిర్ణయంపై స్పందించిన సమీర్ వాంఖడే.. “నన్ను విచారణ నుంచి తొలగించలేదు. కేంద్ర బృందాలు విచారణ జరిపించాలని నేనే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశా. కాబట్టే ఆర్యన్, సమీర్ ఖాన్ కేసులను దిల్లీ ఎన్​సీబీ ఆధ్వర్యంలోని సిట్ విచారించనుంది. ఇది దిల్లీ, ముంబయికి చెందిన ఎన్​సీబీ బృందాల సమన్వయంతోనే జరుగుతోంది” అని అన్నారు.

Also Read: Puneeth Raj Kumar: పునీత్‌ రాజ్​కుమార్​ 'హార్ట్‌ టచింగ్‌' పెయింటింగ్‌ వైరల్

Also Read: Ravi Teja New Movie: జోరు చూపిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ.. మరో కొత్త సినిమా ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News