MEGA154 : నవంబరు 6న ‘మెగా 154’ నుంచి చిరంజీవి లుక్
Megastar chiranjeevi 154 movie : చిరంజీవి హీరోగా దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తాజాగా తెలియజేశారు.
Megastar chiranjeevi 154 movie update on november 6th: దీపావళి సందర్భంగా ఇవాళ చాలా మూవీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి. పలువురు దర్శకనిర్మాతలు తమ కొత్త చిత్రాల వివరాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలు మూవీల నుంచి టీజర్స్, ప్రోమోలు, సాంగ్ టీజర్స్ ఇలా చాలానే రిలీజ్ అయ్యాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) మూవీకి సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది.
చిరంజీవి హీరోగా దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) (Bobby ) గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తాజాగా తెలియజేశారు. మెగా 154 వర్కింగ్ టైటిల్‌తో (Mega 154) ఈ మూవీని నవంబరు 6న ఉదయం 11: 43 ని.లకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే ‘ముందుంది మెగా పండగ’ అంటూ డైరెక్టర్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read : Virat Dancing in Ground: మ్యాచ్ మధ్యలో డ్యాన్స్ చేసిన విరాట్.. వీడియో వైరల్
నవంబరు 6న మధ్యాహ్నం 12:06 ని.లకు చిరంజీవి లుక్‌ని (Chiranjeevi) విడుదల చేయనున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక త్వరలో హీరోయిన్, మూవీ పేరు సంబంధిత డిటేల్స్ రానున్నాయి.
Also Read : Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి