Bhola Shankar Day 1 Collections: మెగాస్టార్ చిరంజీవి-మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ (Bhola Shankar). మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ యాక్ట్ చేయగా.. కీలకపాత్రలో సుశాంత్ నటించాడు. బాక్సాఫీసు వద్ద డివైడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. భారీ అంచనాలు పెట్టుకుంటే.. మూవీ అవుట్ డేటెడ్‌గా ఉందంటూ సినీ ప్రియులు అంటున్నారు. సినిమా చూసిన వారు నెట్టింట ట్రోల్స్ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భోళా శంకర్ మూవీ  సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ గత చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.4.51 కోట్లు, సీడెడ్ 2.02 కోట్లు, యూఏ 1.84 కోట్లు, తూర్పు గోదావరి 1.32 కోట్లు, పశ్చిమ గోదావరి 1.85 కోట్లు, గుంటూరు 2.08 కోట్లు, కృష్ణ 1.03 కోట్లు, నెల్లూరులో 73 లక్షలు వసూళ్లు రాబట్టినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే రూ.82 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ రేంజ్ కలెక్షన్స్ కష్టమేనని అంచనా వేస్తున్నారు.


దీనికితోడు జైలర్ మూవీకి హిట్ టాక్ రావడంతో భోళా శంకర్‌పై భారీ ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. వరుసగా సెలవులు వచ్చినా.. కలెక్షన్స్ పెద్దగా పెరిగే అవకాశాలు లేదని చెబుతున్నారు. టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలను పెంచేసినా.. ఫైనల్‌గా సినిమా మాత్రం పూర్తిగా నిరాశపరిచిందని అంటున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా తెరకెక్కింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించాడు. కలెక్షన్స్ పరంగా చూస్తే.. మెగాస్టార్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరిందని అంటున్నారు.


Also Read: Bhola Shankar Ticket Price: భోళా శంకర్‌ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఎందుకు రాలేదు..? అసలు కారణాలు ఇవే..!  


Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి