Ram Mandir: రామమందిర ఆహ్వానం గురించి ఎమోషనల్ అయిన చిరంజీవి.. ట్వీట్ వైరల్
Megastar Chiranjeevi: జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి రామ్ చరణ్ కి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు చిరంజీవి ఎమోషనల్ గా పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది…
Ram Mandir Invitation: మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడి భక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చిరంజీవిని అలానే రామ్ చరణ్ ని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగంటల క్రితమే అయోధ్యకు చేరుకున్నారు.
చిరంజీవి.. రామ్ చరణ్ కూడా అయోధ్యకి బయలు బయలుదేరుతుండగా చిరు, చరణ్‌కి శుభాకాంక్షలు తెలియజేయడానికి మెగా ఫ్యాన్స్ చిరు ఇంటికి చేరుకున్నారు. దీంతో చిరు, చరణ్ బయటకి వచ్చి వారికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా రామ మందిరానికి అందిన ఆహ్వానం గురించి ఎమోషనల్ అవుతూ ట్వీట్ కూడా వేశారు చిరంజీవి.
“ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం నిజంగా అపరిమితమైన అనుభూతి. ఇక ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందడం అనేది..అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడానికి నాకు దేవుడిచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. నిజంగా ఇది నాకు వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది కొత్త చరిత్ర నాంది, ఉన్న చరిత్రకు ఉర్రూత, దేశ చరిత్రలోనే చిరస్థాయి. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను” అంటూ తన ట్విట్టర్లో ట్వీట్ వేశారు మెగాస్టార్.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్, ధనుష్ కి ఆహ్వానాలు అందాయి. మరి ఇంకెవరన్నా తెలుగు తమిళ హీరోలకి కూడా ఆహ్వానాలు అండాయా లేదా తెలియాలి అంటే రేపు ఈ ప్రారంభోత్సవం జరిగే వరకు వేచి చూడాలి.
Also read: Healthy Eye Sight: మెరుగైన కంటి చూపు కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి!
Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్ వంశీయులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి