Tips For Eye Sight: వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను అందరూ ఎదుర్కొంటున్నారు.మన కంటి రెటీనా ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఎ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కంటి సమస్య బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అయితే విటమిన్ ఎ తో పాటు ఇతర పోషకాలు కూడా ఎంతో అవసరమవుతాయి. రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కంటిచూపును పెంచే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
➔ ఒమెగా-౩ ఫ్యాటీ యాసిడ్లు తీసుకోవడం వల్ల రెటీనాలో ఉండే ఫోటోరిసెప్టార్స్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఈ ఒమెగా-౩ ఫ్యాటీ యాసిడ్లను అవిసె గింజలల్లో ఎక్కువగా లభిస్తాయి.
➔ జింక్, లూటిన్, జ్గియోస్కాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు కంటి లోపలి కణాలను దెబ్బతినకుండా సహాయపడుతుంది.
➔ గుమ్మడి గింజలల్లో, జనపనార విత్తనాలను తీసుకోవడంలో కంటి చూపు మెరుగుపడుతుంది.
➔ కంటిచూపును మెరుగుపరచడంలో విటమిన్ సి, విటమిన్ ఇ కూడా మనకు సహాయపడతాయి. పొద్దు తిరుగుడు గింజల్లో ఈ విటమిన్‌లు లభిస్తుంది.
➔ పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి.
➔ పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.
➔ డ్రై ఫ్రూట్స్ కంటిచూపును మెరుగుపరడచంతో పాటు కంటి సమస్యలను దూరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ శరీరానికి
➔ కంటి సమస్యలను ఆరెంజ్ పండతో దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలతో పోరాడి సహాయపడుతాయి.
Also Read Ragi Java And Oats: రాగి, ఓట్స్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!
➔ చిలగడదుంపలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
➔ రెడ్ క్యాప్సికమ్‌లో ఎ, సి, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మిరపకాయలతో మీ కళ్లకు ఎన్నో పోషకాలు లభిస్తాయి.
➔ క్యారెట్ జ్యూస్ కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రాత్రి 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఈ విధంగా కంటికి విశ్రాంతిని ఇస్తూ పోషకాహారాలను తీసుకోవడం వల్ల కంటిచూపు పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Warm Water Benefits: గోరు వెచ్చని నీటిలో ఇవి కలుపుకుని తాగితే ఎంతటి రోగమైనా ఇట్టే మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter