Chiranjeevi : పవన్ ను తిట్టినోళ్లే పెళ్లిళ్లకు, పేరంటాలకు రమ్మని బతిమిలాడతారు.. చిరు కీలక వ్యాఖ్యలు!
Megastar Chiranjeevi Comments: తన తమ్ముడు పవన్ ను నోరారా తిట్టిన వాళ్లే పెళ్లిళ్లకు పేరంటాలకు రమ్మని బతిమాలాడతారని అలంటి వాళ్లను కలవాల్సి వస్తోంది, మాట్లాడాల్సి వస్తోందని కామెంట్ చేశారు. ఆ వివరాలు
Megastar Chiranjeevi Comments on People Targetting Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి మరోపక్క సినిమాలు చేస్తుంటే చిరంజీవి మాత్రం పూర్తిస్థాయిలో సినిమాల మీద దృష్టి పెట్టారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా కొన్నిసార్లు తటస్థంగా కొన్నిసార్లు మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ మీద అనేక రకాల విమర్శలు వస్తూ ఉంటాయి కదా వాటిని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నిస్తే అలాంటి విమర్శలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని చెప్పుకొచ్చారు. తను నాకు ఒక కిడ్ బ్రదర్ లాంటివాడు అంటే ఒక రకంగా బిడ్డలాంటి తమ్ముడు అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ని తన చేతులతో ఎత్తుకొని పెంచాలని వాడికి నేను సురేఖ తల్లిదండ్రుల లాంటి వాళ్ళమని చెప్పుకొచ్చారు. పవన్ కి కూడా మేమంటే అంతే ప్రేమ అని పేర్కొన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ కించిత్ స్వార్థం కూడా లేని వ్యక్తి అని అతనికి డబ్బు యావ లేదు, పదవీ కాంక్ష లేదు, తనకోసం ఎప్పుడూ ఆలోచించుకోకూడని చెప్పుకొచ్చారు. నేను ఒక అన్నగా చెప్పడం లేదు తనను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నానని పేర్కొన్న చిరంజీవి మొన్నటి వరకు వాడికి సొంత ఇల్లు కూడా లేదని మా అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి నువ్వు కూడా ఒకటి కట్టుకో అంటే చూద్దాం అని దాటవేసేవాడని అన్నారు.
సమయానికి అన్నం తినడు, సరైన బట్టలు వేసుకోడు సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని తపనతో అన్నీ వదిలేసిన యోగి లాంటివాడు అని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి పేర్కొన్నారు. చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి రాజకీయాలనే మురికికూపంలోకి వెళ్లాడని అక్కడ ఉన్న మురికి ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడని అన్నారు. ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుంటుందని పేర్కొన్న చిరంజీవి మురికి తీసే వాళ్లకు మురికి అంటుకోవడం సహజమే కదా అని అన్నారు. ఇక ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలని పేర్కొన్న చిరంజీవి అలాంటి వారిని ప్రోత్సహించాలని అన్నారు.
అయితే ఒక్కోసారి మితిమీరి అనరాని మాటలు పవన్ కళ్యాణ్ అని అంటున్నప్పుడు మాత్రం తనకు బాధ కలుగుతుందని అన్నారు. అంతేకాక పవన్ కళ్యాణ్ ను తిట్టిన వాళ్లే మళ్ళీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు పేరంటాలకు పిలుస్తారని రమ్మని బతిమలాడతారని చెప్పుకొచ్చారు. నా తమ్ముడిని అన్ని మాటలు అన్న వాళ్లతో మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళను మళ్ళీ కలవాల్సి వస్తుందని తనకు బాధ కలుగుతుందని మెగాస్టార్ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: NTR 30 Update: నందమూరి ఫాన్స్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. కొరటాల శివ ఏంటి ఇలా చేశాడు?
Also Read: AHA Video APP Crash: ప్రభాస్ ఫాన్స్ వల్లే యాప్ క్రాష్ అయిందా.. వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook