Chiranjeevi Responded on Garikipati: గరికపాటి వివాదం పై చిరు భిన్న స్పందన.. ఆ అవసరమే లేదంటూ కామెంట్స్..!
Chiranjeevi Finally Responded on Garikipati Narasimha Rao Comments: చిరంజీవి మీద గరికిపాటి చేసిన కొన్ని కామెంట్ల నేపథ్యంలో టాలీవుడ్లో దుమారం రేగింది. ఇక ఎట్టకేలకు ఈ వ్యవహారం మీద చిరంజీవి స్పందించారు.
Megastar Chiranjeevi Finally Responded on Garikipati Narasimha Rao Comments: మెగాస్టార్ చిరంజీవి మీద కొన్నాళ్ల క్రితం తెలుగు ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు కాస్త అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ భలయ్ అనే కార్యక్రమానికి ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ప్రవచనకర్త, గరికిపాటి నరసింహారావు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఇక మెగాస్టార్ చిరంజీవిని చూసి అనేకమంది ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతూ ఉండగా అప్పుడే మైకందుకొని ప్రసంగం మొదలు పెడుతున్న గరికిపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి అక్కడి నుంచి వచ్చి తన పక్కన కూర్చుంటే తప్ప తాను ప్రసంగాన్ని ప్రారంభించేది లేదని లేదు రాను అంటే ప్రసంగాన్ని ఆపేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి కూడా తాను మొహమాట పడనని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం చాలా వినయంతో ఆయన పక్కకు వెళ్లి కూర్చోవడమే కాక ఆయనంటే తనకు చాలా అభిమానం అని ఆయన ఒకసారి తన ఇంటికి భోజనానికి రావాలని కూడా అక్కడికక్కడే అభ్యర్థించారు. అయితే ఇది పెద్ద వివాదంగా మారి ఉండేది కాదు కానీ అంతా అయిపోయిన తర్వాత నాగబాబు ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ కలకలం రేపింది. నాగబాబు ఇలా ట్వీట్ చేస్తే ఇక మేమెంత రెచ్చిపోవాలి? అంటూ మెగా అభిమానులు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.
ఇక ఇంత రాద్దాంతం జరుగుతుంటే మేమెందుకు ఊరుకుంటాం అంటూ సినీ పరిశ్రమలో మెగాస్టార్ అభిమానులుగా పేరు తెచ్చుకున్న వారు కొంతమంది గరికిపాటి నరసింహారావు మీద తమదైన శైలిలో కౌంటర్లు వేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారం ఒకరకంగా చినికి చినికి గాలి వానలా మారి అనేక విపరీత పరిస్థితులకు దారితీసింది. చివరికి నాగబాబు ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవడం మా ఉద్దేశం కాదు ఆయన చేసిన తప్పు ఎత్తిచూపటమే ముఖ్య ఉద్దేశం అంటూ ట్వీట్ చేయడంతో ఈ వివాదం సద్దుమణిగింది అనుకున్నారు.
కానీ ఆ తర్వాత మళ్లీ గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ మీట్ లో మళ్లీ గరికిపాటిని టార్గెట్ చేస్తూ పలువురు మాట్లాడారు. ఇక ఈ విషయంలోకి ఎంటర్ అయిన రాంగోపాల్ వర్మ కూడా గరికిపాటిని టార్గెట్ చేస్తూ అనేక ట్వీట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యవహారం మీద స్పందించారు. ‘‘గరికిపాటి పెద్దాయన, గొప్ప వ్యక్తి అని పేర్కొన్న చిరంజీవి ‘‘గరికిపాటి చేసిన వ్యాఖ్యలపై చర్చించు కోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కామెంట్స్ చేయడంతో ఇకనైనా ఈ కామెంట్స్ కు గరికపాటి నరసింహారావు ను టార్గెట్ చేస్తున్న మెగా అభిమానులకు కనువిప్పు కలుగుతుందేమో చూడాలి.
Also Read: Samantha No.1 in Tollywood: ఈ ఏడాదిలో ఒక్క సినిమా రిలీజ్ అవ్వకున్నా సమంతే టాలీవుడ్ క్వీన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook