COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chiranjeevi Helps Goutham Raju Family: తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 800 చిత్రాలకు పైగా ఎడిటర్ గా వ్యవహరించిన గౌతమ్ రాజు బుధవారం తెల్లవారుజామున అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుట పడడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున సుమారు ఒకటిన్నర ప్రాంతంలో కన్నుమూశారు. 


ఆయన మరణ వార్త తెలుసుకుని తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  అయితే మెగాస్టార్ కెరియర్లో అనేక సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించిన గౌతమ్ రాజు మరణం వార్త విని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాక గౌతమ్ రాజు కుటుంబానికి తక్షణ సాయంగా సుమారు రెండు లక్షల రూపాయలు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా పంపించారు.


గౌతమ్ రాజు కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమ అండగా ఉంటుందని మెగాస్టార్ అభయం ఇచ్చినట్లు తమ్మారెడ్డి భరద్వాజ గౌతమ్ రాజు కుటుంబానికి వెల్లడించారు. మరోపక్క మోహన్ బాబు కూడా గౌతమ్ రాజు మరణానికి చింతిస్తున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గౌతమ్ రాజు ఇద్దరు కుమారులు తన స్కూల్లోనే చదువుకున్నారని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారని అంతా బాగుంటుంది అనుకుంటున్న తరుణంలో గౌతమ్ రాజు కన్ను మూయడం బాధాకరమంటూ ఆయన ట్వీట్ చేశారు.


Also Read: Vk Naresh: నటుడు నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?


Also Read: Samantha Insta account Hack: సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ వెనుక ఇంత జరిగిందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook