Megastar Chiranjeevi Indirect Counters on koratala Siva: గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా నటించారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించాల్సి ఉండగా ఆమె నటించిన తర్వాత పాత్ర పూర్తిగా తొలగించారు. అయితే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ అందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా ఫస్ట్ లో హిట్ అని చెప్పుకుంటూ వచ్చిన సినిమా నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ ఆ తరువాత ఈ సినిమా డిజాస్టర్ అని స్వయంగా రామ్ చరణ్, చిరంజీవి ఒప్పుకోవడంతో సైలెంట్ అయింది. అయితే ఇది పూర్తిగా దర్శకుడి వైఫల్యం అంటూ అటు రామ్ చరణ్ ఇటు మెగాస్టార్ ఇద్దరు ఈ ఫలితాన్ని కొరటాల శివ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మామూలుగా జరిగే విషయమే అయినా తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే విషయాన్ని చిరంజీవి ప్రస్తావించారు.


పరోక్షంగా కొరటాల శివను ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్లు చేసినట్లు సినీ విశ్లేషకులు భావిసున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి  వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబిని పొగుడుతూనే దర్శకుడు కొరటాల శివకి మెగాస్టార్ చురకలు అంటించారని తెలుస్తోంది. ముక్కు సూటిగా పనిచేయడం, ఎవరు ఏం చెప్పినా వాళ్ళు చెప్పింది పెడచెవిన పెట్టకుండా వినడం, ఎవరు ఏం చెప్పినా ముందు అలాగే సార్ అని విని తర్వాత పెడచెవిని పెట్టే రకం కాదని బాబీ గురించి మెగాస్టార్ కామెంట్ చేశారు.



ఇన్ని సినిమాల అనుభవం ఉన్న వ్యక్తి ఏదో చెప్పారు అంటే దానికి ఏదో అర్థం ఉంటుంది, ఇది నేను వెళ్లి కరెక్ట్ చేసుకు రావాలి అని ఆయన అహర్నిశలు ఆ సినిమాని ఇంకొంచెం బెటర్ గా చేయడం కోసం తన టీం తో నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని బాబీ గురించి బాబీ టీమ్ గురించి ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ అన్నీ పరోక్షంగా కొరటాల శివను ఉద్దేశించి మెగాస్టర్ చేసినవే అని కొరటాల వల్ల ఇలాంటి డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.   
 Also Read: Ram Gopal Varma: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదన్న వర్మ.. డబ్బు కోసం ఏమైనా నాకుతావన్న టీడీపీ నేత!


Also Read:  Varasudu Movie: ఇంతకూ వారసుడు వాయిదాకి అసలు కారణం ఇదా.. పెద్ద స్కెచ్చే ఇది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook