Zee Cinemalu: మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా విడుదలై ఘనవిజయం సాధించి రెండు దశాబ్దాలు పూర్తయింది. చిరంజీవి, సోనాలీ బింద్రే జంటగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇంద్ర, డిసెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు జీ సినిమాలులో!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ సినిమాలు వేదికగా ఇంద్ర సినిమా ప్రసారం కానుంది.  వైజయంతీ మూవీస్ సమర్పణ లో బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం ఇంద్ర. 


ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి  మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే నటించిన ఈ సినిమా విజయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. రాయలసీమలోని ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన టాక్సీ డ్రైవర్ శంకర్ నారాయణ్ (చిరంజీవి పాత్ర) చుట్టూ తిరిగే ఈ చిత్రం సమాజంలో లోతుగా పాతుకుపోయిన శత్రుత్వాన్ని అంతం చేసేందుకు ఇంద్రసేనా రెడ్డి చేసిన ప్రయత్నాన్ని చక్కగా చూపిస్తుంది. క్షమాగుణం, సయోధ్య, న్యాయం యొక్క ఇతివృత్తాలే ప్రధాన కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మూడు నంది అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటుడి విభాగంలో చిరంజీవి ప్రశంసలు అందుకున్నారు.
ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో తమిళంలో 'ఇంద్రన్'గా, హిందీలో 'ఇంద్ర: ది టైగర్' పేరుతో డబ్బింగ్ చేశారు. ఆర్తి అగర్వాల్, తేజ సజ్జా, ప్రకాశ్ రాజ్, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలోని అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు మెలోడీ కింగ్ మణిశర్మ అందించిన అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 


దాదాపు 9 సంవత్సరాల తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకులను పలకరించేందుకు డిసెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు మీ అభిమాన ఛానల్ జీ సినిమాలులో 'ఇంద్ర' సినిమా ప్రసారం కాబోతుంది, మీరూ మిస్సవకండి!


2023కి వీడ్కోలు పలుకుతూ జీ సినిమాలు అందిస్తున్న ఎవర్ గ్రీన్ మెగా యాక్షన్ డ్రామా ఇంద్ర, తప్పక చూడండి! 


Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు


Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook