Megastar Chiranjeevi Interesting Comments on Directors: మెగాస్టార్ చిరంజీవి దర్శకులు, నిర్మాతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఒక సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చాలా మంది దర్శకులు మేము అరగంట గంట సినిమా ఇంకా వేస్ట్ చేశామని ఆ కథ ఇంకా ఉందని చాలా మంది అంటూ ఉంటారని అదే మా సినిమా కేవలం 7:30 నిమిషాలు మాత్రమే కట్ చేశామని చిరంజీవి చెప్పుకొచ్చారు. అది కూడా ఫైట్ మాస్టర్లు కాస్త ఎక్కువ షూట్ చేస్తే దాన్ని తగ్గించామని చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాబీ సినిమాని కరెక్ట్ గా తీశాడని అందుకే నిర్మాతలకు ఒక నయా పైసా కూడా వేస్ట్ కాలేదని అన్నారు. చాలామంది సీనియర్ దర్శకులు లేదా యంగ్ దర్శకులు హర్ట్ అవుతారేమో కానీ దర్శకుడు ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ ఇచ్చామా లేదా అనేది కాదు, ఒక అద్భుతమైన కథ ఇచ్చామా లేదా అనేది కాదు అన్ని ఓకే అనుకున్న తర్వాత నిర్మాతలకు ఆన్ టైం సినిమా తీసి ఇవ్వడం, చెప్పిన బడ్జెట్ లో పూర్తి చేసి ఇవ్వడం మీ మొదటి సక్సెస్ గా ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని వాడి వాళ్ళ ఫలితాలు చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ అర్రులు చాచే కంటే నా దగ్గర ఉన్న కథతో ఒక సాధారణ కెమెరా వాడి నేను అత్యద్భుతమైన సినిమా చేయగలను అని అనుకోవాలని అన్నారు.


అత్యాధునిక టెక్నాలజీ అనేది ఒక అవసరం మేరకు తీసుకోండి అలా అని దాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తే దానికి అనుగుణంగా ఖర్చు కూడా పెరుగుతుంది అని అన్నారు. ఇలాంటి నిర్మాతలు మీకు ఫ్రీడమ్ ఇస్తే కనుక ఇంకా ఇంకా ఖర్చు పెడుతున్నారు అలా చేయవద్దని ఆయన అన్నారు. దయచేసి ఇండస్ట్రీ బాగుండాలంటే ముందుగా బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు డైరెక్టర్లు మాత్రమే అని అన్నారు. బాబీ అంత ఖర్చు పెట్టాడు అని చెప్పి కథ డిమాండ్ చేయకపోయినా అతనికన్నా 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలని తాపత్రయ పడవద్దు అని అంటూ ఆయన కామెంట్ చేశారు.


అదే సమయంలో మీడియాని ఉద్దేశిస్తూ మీరు కూడా వాళ్ళని ఉద్దేశించి మెగాస్టార్ ఈ కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ చేశారు అని రాతలు రాయవద్దని తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అందరి ముందుకు వెళుతున్న తరుణంలో ఇలా రాసుకుంటూ పోతే మనని మనమే చిన్నతనంగా చేసుకున్నట్లు అవుతుందని అన్నారు. ఇది ఎవరు నీ ఉద్దేశించి కామెంట్ చేసింది కాదని ఒక సలహాలా  ఇస్తున్నానని అన్నారు. దర్శకులనే వాళ్లు నిర్మాతలను బతికించాలని, వాళ్లకు భుజం కాయాలని, అలా కనుక ఈ సినిమా కూడా యావరేజ్ గా ఆడి థియేటర్ల నుంచి క్విట్ అయినా సరే నిర్మాతలకు డబ్బులు వచ్చేస్తుందని వాళ్లకు నష్టం మాత్రం కలగదని అన్నారు. వాళ్ళు ఇంకా సంతోషపడి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తే కాదనకుండా తీసుకుంటామని అన్నారు. 


Also Read: Veera Simha Reddy Collections: 'వీర సింహా రెడ్డి'కి భారీ దెబ్బ్బేసిన వీరయ్య.. మరీ ఇంత దారుణంగా పడిపోయాయా?


Also Read: Waltair Veerayya Collections: మెగాస్టార్ కు మాస్ మహా రాజా తోడైనా.. ఆ సినిమా వసూళ్లను దాట లేకపోయిందే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook