Waltair Veerayya Movie Day 1 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కనిపించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగినట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ కూడా లభించింది.
కాబట్టి ఈ సినిమా మొదటిరోజు వసూళ్లు ఏ మేరకు వసూలు చేసింది అనే విషయాన్ని పరిశీలిద్దాం. వాల్తేరు వీరయ్య మొదటి రోజు ఏరియాల వారీగా ఎంత వసూలు చేసింది అనే విషయంలోకి వెళితే నైజాం ప్రాంతంలో ఈ సినిమా ఆరు కోట్ల 10 లక్షలు వసూలు చేసింది. సీడెడ్ ప్రాంతంలో ఈ సినిమా నాలుగు కోట్ల 20 లక్షలు వసూలు చేస్తే ఉత్తరాంధ్ర లో రెండు కోట్ల 57 లక్షలు వసూలు చేసింది.
అదే విధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల 68 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల ఆరు లక్షలు వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 75 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా కృష్ణా జిల్లాలో కోటి 49 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి ఐదు లక్షలు వసూలు చేసింది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల 9 0 లక్షల షేర్, 35 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. కర్ణాటక సహా మిగతా భారత దేశంలో కోటి 65 లక్షలు వసూలు చేసి ఓవర్సీస్ లో నాలుగు కోట్ల 75 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల 30 లక్షల షేర్, 49 కోట్ల పది లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి బిజినెస్ 88 కోట్లకు జరగగా బ్రేక్ ఈవెన్ 89 కోట్లుగా నిర్ణయించారు.
వాల్తేరు వీరయ్య సినిమా భారీ అంచనాలాతో విడుదలైనా సైరా మొదటి రోజు వసూళ్లను అధిగమించలేకపోయింది. బాలకృష్ణ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆ సినిమాను తప్పించి ఎక్కువ థియేటర్లు ఈ సినిమాకు ఇవ్వలేకపోయారని అందుకే ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి సూపర్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 59 కోట్ల 75 లక్షల సంపాదించాల్సి ఉంటుంది.
సంక్రాంతి సీజన్ కావడంతో అది పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ రవితేజ సరసన కేథరిన్ తెరెసా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో బాబీ సింహ, ప్రదీప్ రావత్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి, సుబ్బరాజు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
నోట్: ఈ వివరాలు వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మేము సేకరించినవి, వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Dhamaka OTR Release: ఇక ఓటీటీలో ధమాకా సృష్టించనున్న మాస్ మహారాజా రవితేజ, ఎప్పుడంటే
Also Read: BVS Ravi Movies: పూర్తిగా కమెడియన్ గా మారిపోతున్న డైరెక్టర్.. అన్ని సినిమాల్లో అదే తరహా పాత్రలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook