Megastar Chiranjeevi: చిరంజీవి మెగాస్టార్ అయ్యే క్రమంలో తెలుగు పరిశ్రమకు ఎన్నో బ్లాక బస్టర్లు ఇచ్చారు. స్వయంకృషితో సినిమాలో కి  ఎంటర్ అయిన చిరంజీవి తన ఒక్కో సినిమాతో అందనంట ఎత్తుకు ఎదిగి టాలీవుడ్ లో మెగాస్టార్ గా నిలిచారు. కాగా చిరంజీవి ఎన్నో సినిమాలు ఉన్నా కానీ అందులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉందే చిత్రం ఖైదీ. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చే పేరు ఖైదీ. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరంజీవిని తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ గా చేసిన సినిమా ఏది అంటే అది తప్పకుండా ఖైదీ సినిమా అనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనకు ఆ పేరు రావడానికి తొలిమెట్టుగా నిలిచింది ఖైదీ సినిమా. సినిమాలలో చిన్న క్యారెక్టర్లతో అలానే విలన్ గా కూడా నటించి పాపులర్ అయిన చిరంజీవి సూపర్ హీరోగా ఎదిగేలా చేసిన సినిమా ఖైదీ. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి కెరియర్ లో ఖైదీ సినిమాకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. 1983లో విడుదలైన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక మరపురాని చిత్రంగా మిగిలింది. కాగా ఈ సినిమా విడుదల అయ్యి ఈ రోజుతో 40 సంవత్సరాలు పూర్తి కావడం విశేషం.


ఖైదీ సినిమా విశేషాలకు వస్తే ఈ సినిమాను నిర్మాతలు ముందుగా చిరంజీవితో కాకుండా కృష్ణతో అనుకున్నారట. సంయుక్తా బేనర్ ఫస్ట్ సినిమాగా ఆయనతో తీయాల్సిందట. కానీ ఆయన అప్పట్  రాజకీయాలు అలానే మరిన్ని సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఫైనల్ గా ఈ చిత్రం చిరంజీవి చేతికి వెళ్ళింది. ఇక ఈ చిత్రం మూడు షెడ్యూల్స్‌లో కేవలం 40 రోజుల్లోనే షూట్ పూర్తి చేశారట. 


ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు 25 లక్షలకు అమ్మితే కోటి రూ. వసూలు చేసి ఘనవిజయం సాధించింది . అప్పట్లో ఈ సినిమా 19 కేంద్రాల్లో 50 రోజులు, 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కాగా ఈ చిత్రంలో చెప్పుకోవలసిన మరో విశేషం ఏమిటి అంటే ఈ సినిమాకి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్. అప్పటివరకు చిరంజీవికి పెద్ద పేరు లేకపోయినా అప్పట్లోనే ఖైదీకి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ ఏకంగా రూ. 1,75,000 అని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఈ చిత్రానికి నిర్మాతకు అయిన ఖర్చు గురించి ఆ నిర్మాటే మాట్లాడుతూ చిరంజీవికి లక్ష 75000 అలానే డైరెక్టర్ కోదండరామిరెడ్డి , మాధవిలకు 40, 000, సుమలతకు 20 వేలు ఇచ్చామని తెలియజేశారు 



ఇక ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రంగా మెగలగా ఈ సినిమా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి కూడా ఒక పోస్ట్ వేశారు.' 'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ,ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు! ' అంటు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు చిరంజీవి.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook