Megastar Chiranjeevi Last 5 Movies World Wide  1st Week Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసింది. పోటీగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ అయినా సరే వాల్తేరు వీరయ్య మిగతా అన్ని సినిమాలను వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా ముందుకు దూసుకు వెళ్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా చిరంజీవి గత నాలుగు సినిమాల వసూళ్లు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు సినిమా మొదటి వారంలో 96 కోట్ల 46 లక్షల షేర్ 165 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది. అదే గాడ్ ఫాదర్ సినిమా వారం రోజుల్లో 53 కోట్ల పది లక్షల షేర్ 96 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూలు చేసింది. వాస్తవానికి గాడ్ ఫాదర్ సినిమాకి మంచి టాక్ వచ్చింది కానీ వసూళ్ల విషయంలో మాత్రం ఆ సినిమా వెనకబడిందనే చెప్పాలి.


ఇక మెగాస్టార్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమా మొదటి వారం 47 కోట్ల 87 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే 75 కోట్ల ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది.  ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను సాధించింది. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి కనిపించిన మొట్టమొదటి ఫుల్ లెన్త్ సినిమా కావడంతో మొదటి రోజు బుకింగ్స్ భారీగా నమోదయ్యాయి. అయితే మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూళ్లు పడిపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్న సైరా నరసింహారెడ్డి సినిమా మొదటి వారం రోజులు లో 115 కోట్ల 38 లక్షల షేర్ 128 కోట్ల ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఒకరకంగా చూసుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా కంటే సైరా నరసింహారెడ్డి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనే చెప్పాలి. అయితే దీన్ని పాన్ ఇండియా సినిమాగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడంతో ఆమెను వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సైరా నరసింహారెడ్డిలో అమితాబచ్చన్, కిచ్చా సుదీప్ వంటి వారు కూడా నటించారు. కాబట్టి మొదటి వారం 115 కోట్ల దాకా షేర్ వసూలు రాబట్టిందని అంచనా వేస్తున్నారు. ఇక మెగాస్టార్ రీఎంట్రీ సినిమాగా చెబుతున్న ఖైదీ నెంబర్ 150 77 కోట్ల 32 లక్షల షేర్ వసూలు చేస్తే 116 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి గత ఐదు సినిమాల వసూళ్లను గనుక పరిశీలిస్తే సైరా నరసింహారెడ్డి సినిమా మొదటి స్థానంలో నిలుస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా  వసూళ్ల విషయంలో సైరా నరసింహారెడ్డి కంటే వెనకే ఉంది.


నోట్: ఈ సమాచారం వివిధ బాధ్యత మాల ద్వారా మేము సేకరించినదే కానీ దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు


Also Read: Veera Simha Reddy 8 Days Collections: జోరు తగ్గిన 'వీర సింహం' బ్రేక్ ఈవెన్ కు ఇంకా దూరంగానే?


Also Read: VSR vs WV Collections: వీర సింహా రెడ్డిని దారుణంగా వెనక్కు నెట్టేసిన వాల్తేరు వీరయ్య.. ఎంత తేడానో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook