Acharya movie release date: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఫలితంగా సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోవడానికి కారణమేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌లో దర్శకుడు కొరటాల శివ (Koratala siva) అంటే ఓ ప్రత్యేకత ఉంది. సక్సెస్ ఫుల్ చిత్రాల డైరెక్టర్‌గా అతనికి ప్రత్యేకత ఉంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, వెంకటేశ్ ప్రతి ఒక్క హీరోతో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఘనత అతడికే సొంతం. అందుకే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi)-కొరటాల శివ ( Koratala siva) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఆచార్యపై అందరికీ చాలా అంచనాలున్నాయి. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ ( Ram charan) ‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.


వాస్తవానికి ఈ సినిమాను మే 14 సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఫైనల్ షూట్‌లో భాగంగా రామ్ చరణ్, సోనూ సూద్ మధ్య యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అనుకోకుండా సోను సూద్ ( Sonu Sood) కరోనా బారిన పడటంతో ప్రస్తుతానికి ఆచార్య షూటింగ్( Acharya movie shooting) ఆగిపోయింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా దీనిపై ప్రకటన చేయలేదు.


Also read: Jayalalitha Biopic: జయలలిత బయోపిక్స్‌కు మద్రాస్ హైకోర్టు లైన్ క్లియర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook