Megastar Chiranjeevi Movie with his Daughter: బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పటివరకు భారీ డిజాస్టర్ అయిన ఆచార్య బరువును మోసుకుంటూ తర్వాత గాడ్ ఫాదర్ తో ఒక మాదిరి హిట్ అందుకున్న ఆయన ఎందుకు రీమేక్ సినిమాలు, రొటీన్ సినిమాలు చేస్తారు అంటూ ఆయన మీద పెద్ద విమర్శలు వచ్చాయి. కానీ వాల్తేరు వీరయ్య ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ విమర్శలు రెండింటి పక్కన పెట్టేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మిగతా అన్ని సినిమాల కంటే ముందుండి అన్నింటినీ వెనక్కి నెట్టి భారీగా వసూళ్లు కూడా రాబట్టింది. ఒక రకంగా మెగా ఫ్యాన్స్ అందరికీ ఇది భారీ బూస్ట్ కూడా ఇచ్చింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెలతో ఒక సినిమా ఫైనల్ చేసుకున్నారని ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు అన్నీ పూర్తయ్యాయి అని అంటున్నారు. కానీ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని అంటున్నారు.


కార్తీతో సర్దార్ అనే సినిమా చేసిన తమిళ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు బివీఎస్ రవి కథ అందించినట్లు తెలుస్తోంది. ఈ కథ చిరంజీవికి బాగా నచ్చడంతో కచ్చితంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది..చిరంజీవి కుమార్తె సుస్మిత ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఇటీవల నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే.


గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి గతంలో కొన్ని వెబ్ సిరీస్ లు చేయగా ఇటీవల శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా కూడా చేశారు. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోక పోయినా వాళ్లు మాత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో బయటపడి పోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ బ్యానర్ లో రెండవ సినిమా కోసమే మెగాస్టార్ ఈ ప్రాజెక్టు సెట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన త్వరలోనే వెలువరించే అవకాశం అయితే కనిపిస్తోంది.


Also Read: Vedhika Photos: హద్దులు దాటేస్తున్న వేదిక అందాల ఆరబోత.. సెగలు రేపేస్తోందిగా!


Also Read: Mrunal Thakur Photos: జక్కన్న చెక్కిన శిల్పానివా మృణాల్ ఠాకూర్..శిల్పాల మధ్య మెరుస్తోందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి