Megastar Chiranjeevi Crucial Decision: గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మెగాస్టార్ సంచలన నిర్ణయం!
Megastar Chiranjeevi Trimmed 20 Minutes From God Father Movie: మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేశారు. చిరంజీవి సినిమా మొత్తం చూసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
Megastar Chiranjeevi Trimmed 20 Minutes From God Father Movie: మెగాస్టార్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా గాడ్ ఫాదర్ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు, హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళం వర్షన్ కూడా విడుదల చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటి వరకు అధికారికంగా సినిమా యూనిట్ అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్ సముద్ర ఖని వంటి వారు కీలక పాత్రలలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేశారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్టు చేశారు. నిజానికి ముందుగా గాడ్ ఫాదర్ సినిమా రన్ టైం మూడు గంటల వరకు వచ్చిందట.
ఆ తర్వాత చిరంజీవి సినిమా మొత్తం చూసి సుమారు 20 నిమిషాల వరకు కట్ చేశారని తెలుస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు లెంతీ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించడం లేదు, ఎంత త్వరగా సినిమా పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో లెంతీ సినిమాలు చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించిన చిరంజీవి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకొని మరీ 20 నిమిషాల పాటు నిడివి తగ్గించారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా రీ షూట్ చేస్తున్నారనే ప్రచారం ఒకపక్క జరుగుతుండగా అది రీషూట్ కాదని పెండింగ్ షూట్ అని మరో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే సెన్సార్ పూర్తయిన సినిమాకు ఈ రీషూట్ లేదా పెండింగ్ షూట్ చేయడం ఎలా పాజిబుల్ అవుతుంది అని చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారాలు ఆగేలా కనిపించడం లేదు.
Also Read: NTR 30 Shoot: కొరటాల టెన్షన్ తీర్చేసిన ఎన్టీఆర్.. ఆ ఒక్క మాటతో అంతా క్లియర్!
Also Read: Rana Naidu Teaser Review: తండ్రీ కొడుకులుగా అదరకొట్టిన వెంకీ-రానా.. టీజర్ మాములుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook