NTR Finally Gave Nod to Koratala Siva Shoot to Start soon: చాలా కాలం నుంచి ఎన్టీఆర్ 30(NTR30) సినిమా మీద అనేక అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అనే అనుమానం కూడా ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కొరటాల శివ ఎన్టీఆర్ ను కలిసి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ అంతా వివరించి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు సూచించిన ఎన్టీఆర్ ఎట్టకేలకు కొరటాల శివ చెప్పిన స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది దాదాపుగా నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే ఒక రకంగా రామ్ చరణ్ శంకర్ లాంటి బడా డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేసి దాన్ని దాదాపుగా షూటింగ్ పూర్తి చేసే స్థితికి వస్తే ఆయనకు ర్ఆర్ఆర్ కోస్టార్ అయిన ఎన్టీఆర్ ఇలా ఇప్పటి వరకు సినిమా ప్రారంభించకపోవడం ఏమాత్రం బాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ క్రేజ్ తో మరింత ముందుకు దూసుకు వెళ్లాల్సింది పోయి ఎందుకిలా రెస్ట్ మోడ్ లోకి వెళుతున్నాడు అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో అభిమానులు కూడా ఎన్టీఆర్ సినిమా మీద ఆసక్తి సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతోందని, ఈ ఇబ్బంది తప్పాలంటే వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన ఏదైనా చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాగో స్క్రిప్ట్ ఓకే అయింది కాబట్టి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయం మీద అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది.
ఈ సినిమాని కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ ఖచ్చితంగా హిట్టు కొట్టాలని బలంగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అందుకే సినిమా మీద భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదని అంటున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలా హిట్టు కొడతారు అనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read: Rana Naidu Teaser Review: తండ్రీ కొడుకులుగా అదరకొట్టిన వెంకీ-రానా.. టీజర్ మాములుగా లేదుగా!
Also Read: Oke Oka Jeevitham: ఓటీటీలోకి శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'... స్ట్రీమింగ్ అందులోనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook