Megastar Chiranjeevi Watched God Gather Final Copy and Praised Mohan Raja: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో హిట్ అందుకున్న ఆయన సైరా సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. తర్వాత వచ్చిన ఆచార్య సినిమాతో డిజాస్టర్ మూట కట్టుకున్న ఆయన తదుపరి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆచార్య దారుణమైన డిజాస్టర్ కావడంతో మెగా అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు గాడ్ ఫాదర్ పైనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాని అక్టోబర్ 5వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడంతో సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి మంచి స్పందన దక్కింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు గాడ్ ఫాదర్ ఫైనల్ కట్ కాపీ రెడీ అయింది అని తెలుస్తోంది. ఫైనల్ కాపీని మెగాస్టార్ కూడా తన ఇంట్లో వీక్షించారని చెబుతున్నారు.


మెగాస్టార్ చిరంజీవికి ఫైనల్ కట్ చూపించిన తర్వాత ఆయన ఎలా స్పందిస్తారు అని సినిమా యూనిట్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూడగా ఫైనల్ కాపీ చూసిన తర్వాత మెగాస్టార్ బాగా ఎక్సైట్ అయ్యారని తెలుస్తోంది. సినిమా గ్రిప్పింగా వచ్చిందని అనుకున్న రీతిలోనే సినిమా వచ్చిందని ఆయన దర్శకుడు మోహన్ రాజాను ప్రశంసించినట్లు చెబుతున్నారు. ఎలాంటి ఔట్పుట్ రావాలి అనుకున్నామో అలాంటి ఔట్పుట్ రాబట్టారు అని చెబుతూ మోహన్ రాజు అని ఆయన అభినందించినట్లు టాక్ వినిపిస్తోంది.


ఇక అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఏమైనా అదనపు హంగులు జోడించవచ్చా అనే విషయంపై సినిమా యూనిట్ తల మొనకలై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ఖాన్, పూరి జగన్నాథ్, సునీల్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే ఐటెం సాంగ్ సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లేలా సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.


Also Read:  Bigg Boss Telugu 6: హౌస్ లో మొట్టమొదటి కెప్టెన్ గా అతనే.. గీతూ ఆశలు గల్లంతు!


Also Read: Brahmastram review: బ్రహ్మాస్త్రం మూవీ ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి