Bigg Boss Telugu 6: హౌస్ లో మొట్టమొదటి కెప్టెన్ గా అతనే.. గీతూ ఆశలు గల్లంతు!

Baladitya Becomes First Caption on Bigg Boss Telugu 6 House: బిగ్ బాస్ లీక్స్ ప్రకారం బిగ్ బాస్ 6 కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 9, 2022, 11:39 AM IST
Bigg Boss Telugu 6: హౌస్ లో మొట్టమొదటి కెప్టెన్ గా అతనే.. గీతూ ఆశలు గల్లంతు!

Baladitya Becomes First Caption on Bigg Boss Telugu 6 House: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమై ఇప్పటికే వారం పూర్తిగా వస్తుంది. ఈ వారం రోజుల్లోనే హౌస్ సభ్యుల మధ్య గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొదటి వారంలో అందరూ సింగర్ రేవంత్ ను టార్గెట్ చేస్తూ ఉన్నట్టు ఎక్కువగా అనిపిస్తోంది. అలాగే గీతూ కూడా తనకు తాను ఒక మోనార్క్ లాగా ఫీల్ అవుతూ అందరినీ డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ముందుగా బిగ్ బాస్ నిర్వహకులు మూడు సెక్షన్లుగా హౌస్ సభ్యులను విభజించారు.

క్లాస్ సెక్షన్ లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్లుగా మారగా మాస్ సెక్షన్ నుంచి మరో ముగ్గురిని కెప్టెన్సీ కంటెండర్లుగా తమను తామే సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెబుతారు. దీంతో ఒకే కంటెస్టెంట్ గా ఉన్న మెరీనా -రోహిత్, ఆర్జే  సూర్య, బాలాదిత్య కెప్టెన్సీ కంటెండర్లుగా  ఎంపికయ్యారు. మొత్తం మీద ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కి ఆరుగురు పోటీ పడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఈ వారం కెప్టెన్ గా బాలాదిత్య నిలవబోతున్నారు. అలా బిగ్ బాస్ సీజన్ 6 మొదటి కెప్టెన్ గా బాలాదిత్య రికార్డులకు ఎక్కారు.

అయితే మరో ప్రచారం ప్రకారం గీతూ కూడా మొదటి కెప్టెన్ గా నిలిచిందని అంటున్నారు. అయితే ఈ ప్రచారం నిజం కాదని అంటున్నారు. అయితే ఎవరు కెప్టెన్ గా నిలిచారు అనేది ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎప్పటిలాగానే హౌస్ లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. మెరీనా రోహిత్ ఇద్దరి మధ్య శ్రీ సత్య దూరుతోంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది ప్రాంక్ అనే విషయం ప్రేక్షకులకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ అది పెద్దగా పేలలేదు.

తర్వాత బిగ్ బాస్ హాట్ స్టార్ స్పెషల్ పోటీ పెట్టారు. అందులో హౌస్ సభ్యులు రెండు టీములుగా అందరూ విడిపోయారు. ఏ టీమ్ నుంచి శ్రీ సత్య బీ టీమ్ నుంచి ఆరోహి వెళ్ళగా శ్రీ సత్య టీంను గెలిపించింది. ఆరోహి గెలవకపోవడంతో రేవంత్ ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించడంతో అది వారిద్దరి మధ్య పెద్ద గొడవకి దారి తీసింది. మధ్యలో ఆది రెడ్డి ఎంట్రీ ఇచ్చి రేవంత్ కు సలహా ఇవ్వడానికి ప్రయత్నించడంతో రేవంత్ ఆ సలహా తీసుకోనని అనడమే కాక వారిద్దరి మధ్య కూడా దూరం పెరిగింది. 

Also Read: Yashoda Teaser: గర్భవతిగా సమంత.. చేయోద్దన్న పనే చేయడంతో?

Also Read: SJ Surya in RC15 : రామ్ చరణ్ సినిమాలో ఎస్జే సూర్య.. ఆ పాత్ర కోసమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News