God Father Trailer: తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ ట్రైలర్ (God Father Trailer) వచ్చేసింది. చిరు యాక్షన్, పవర్ పుల్ డైలాగ్స్, సల్మాన్ ఎంట్రీ, తమన్ నేపథ్య సంగీతంతో ట్రైలర్ అదిరిపోయింది. పూరీ వాయిస్ ఓవర్ అందించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన సినిమా గాడ్ ఫాదర్. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో సల్మాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. మోహన్‌రాజా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి.. ట్రైలర్ ను రిలీజ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైలర్ ఓపెన్ చేస్తే... 'రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు',  'నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను' అంటూ చిరంజీవి (Megastar Chiranjeevi) చెప్పిన డైలాగ్స్ వేరే లెవల్లో ఉన్నాయి.  తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో చాలా మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. కాగా ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని  కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కానుంది. 



Also Read: Krishnam Raju Condolonce Meet: మొగల్తూరుకు ప్రభాస్.. కృష్ణంరాజు సంస్మరణ సభకు 50 వేల మంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook