Megastar Chiranjeevi's Voice Note Created Huge Buzz on God Father Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుంచి సరిగా ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు. అడపాదడపా పోస్టర్లు విడుదల చేసి సినిమా మీద ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశారు కానీ సినిమా నుంచి ప్రకటించిన విధంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా విడుదల చేయలేకపోయారనే అపవాదు సినిమా యూనిట్ మీద ఉంది. నిజానికి సెప్టెంబర్ 15వ తేదీన సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్ లో రూపొందిన తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఆరోజు ఆ సాంగ్ విడుదల అవలేదు కదా ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలు ఐదు నిమిషాలకి విడుదల చేస్తామని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కానీ అంతకంటే ఒక్కరోజు ముందే మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన పది సెకండ్ల వాయిస్ నోట్ తెలుగు సోషల్ మీడియాను, మీడియాను పట్టి కుదిపేసింది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.


అది గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆయన విడుదల చేసిన డైలాగో లేక నిజ జీవితానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్సో అర్థం కాక పెద్ద ఎత్తున చర్చోప చర్చలు జరిగాయి. అసలు సినిమా గురించి చర్చే జరగడం లేదనుకుంటే కేవలం పదే సెకన్ల వాయిస్ నోట్ తో మీడియా మొత్తాన్ని సోషల్ మీడియా మొత్తాన్ని తన వైపు తిరిగేలా చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. నిజానికి లూసిఫర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.


ఒరిజినల్ వెర్షన్ తెలుగులో కూడా విడుదలైంది. దాదాపుగా చాలా మంది చూసే ఉంటారు. ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ ఒక ఎమ్మెల్యే పాత్రలో నటిస్తారు. కొన్నాళ్లపాటు ఊరికి దూరమై ఎక్కడో విదేశాల్లో ఏదో పని చేసి వచ్చిన వ్యక్తి తర్వాత తనను పెంచిన వ్యక్తి మాట కోసం ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన డైలాగే సినిమా మీద బజ్ పెంచడం కోసం ఇలా విడుదల చేసి ఉంటారనే ఒక వాదన వినిపిస్తోంది.


ఏదైతేనేమి అసలు ప్రచారమే లేదని బాధపడుతున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఒకరకంగా పెద్ద ఎత్తున ప్రచారానికి ఊతమిచ్చే విధంగా మెగాస్టార్ చిరంజీవి కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. బాస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఆయన పది సెకన్ల వాయిస్ నోట్ వింటేనే ఇలా ఉందంటే సినిమా మొత్తం విడుదలైతే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని అంటున్నారు.


Also Read: Facts About Chhello Show: చెల్లో షో ఆస్కార్స్‌కు ఎలా వెళ్లింది.. అసలు సినిమా కధ ఏంటో తెలుసా?


Also Read: Ormax Media Pan India Heros: ఒక్క పాన్ ఇండియా హిట్టు కూడా లేని విజయ్ కు మళ్లీ ఫస్ట్ ప్లేసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.