Megha Akash Grand Parent Death టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇంట్లో విషాదం నెలకొంది. మార్చి ఒకటో తేదీన తన బామ్మ చనిపోయిందట. ఈ విషయాన్ని తాజాగా చెబుతూ ఎమోషనల్ అయింది. తన బామ్మ మరణంతో మేఘా ఆకాశ్ కుంగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఆమె వేసిన పోస్ట్ చూసి నెటిజన్లు కరిగిపోతోన్నారు. 'డియర్ అమ్మమ్మ.. నువ్ లేకుండా ఎలా బతకాలో నాకు తెలీదు.. ఇక ముందు నేను ఎలా బతుకుతానో కూడా నాకు తెలియడం లేదు.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేనూ నీలాంటి దాన్నే కాబట్టి ఎలాగైనా బతికేస్తాను.. నువ్ ఎంతో సరదాగా ఉండేదానికి, ఎంతో దయతో మెలిగేదానివి.. ఎంతో మంచిదానివి. నువ్ అందరి కడుపులు నింపేందుకు ప్రయత్నిస్తుంటావు. అందరి మొహం మీద నవ్వులు పూయించేందుకు ప్రయత్నిస్తుంటావు. రోజు నీతో మాట్లాడే మాటలు, చేసే గాసిప్పులు ఇకపై ఉండవని తలుచుకుంటూనే తట్టుకోలేకపోతోన్నాను.


ఇప్పుడు నువ్వు నీ మనిషి దగ్గరకు వెళ్లావ్.. ప్రతీ ఆదివారం మనకు ఎంతో సరదాగా గడిచేది. ఇకపై ఆదివారాలు అలా ఉండవు.. మా అందరిలోనూ నిన్ను చూసుకుంటాం. మాలోనే నువ్ జీవిస్తూ ఉంటావు.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి'.. అంటూ ఎమోషనల్ అయింది.


 



మేఘా ఆకాశ్ చివరగా ప్రేమ దేశం అనే సినిమాలో కనిపించింది. త్రిగుణ్ హీరోగా వచ్చిన ఈ మూవీలో మేఘా ఆకాశ్ అందంగా కనిపించింది. ఉన్నంతలో మెప్పించింది. కానీ ఈ సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. దీంతో ఆమె చేసిన ఈ సినిమా కూడా ఉపయోగపడలేదు. కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి మంచి ఆఫర్లే వస్తుంటాయి. కానీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. నితిన్‌తో చేసిన లై, ఛల్ మోహనరంగ సినిమాలతోనే అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook