Telugu Movies Releasing this weekend in theatres: టాలీవుడ్ లో సరైన హిట్టు కొట్టి చాలా కాలమే అవుతుంది. అంటే పెద్ద సినిమాలుగా విడుదలవుతున్న అన్ని సినిమాలు దెబ్బ వేస్తున్న నేపథ్యంలో విరూపాక్ష లాంటి చిన్న సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. నిజానికి సమ్మర్ సీజన్ అంటేనే పలు బడా సినిమాల నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసి సెలవుల సీజన్ ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ వరుసగా బడా సినిమాలన్నీ బోల్తాపడుతున్న నేపథ్యంలో పెద్ద సినిమాల నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి వెనకడుగు వేస్తుంటే చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం శుక్రవారం నాడు నాలుగు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. ముందుగా నాలుగు సినిమాలు గురించి పరిశీలిస్తే మళ్లీ పెళ్లి, మేము ఫేమస్, మెన్ టు, 2018 అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.


Also Read: Hansika Comments: ఆ హీరో వెంటపడ్డాడు.. సరైన బుద్ధి చెప్పా.. హన్సిక సంచలనం!


అందులో మళ్లీ పెళ్లి విషయానికొస్తే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఈ సినిమాని తమ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తరిగెక్కించారని తెలుస్తోంది. నరేష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా ఒకప్పటి నిర్మాత ఇప్పుడు దర్శకుడిగా మారిన ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


అలాగే రైటర్ పద్మభూషణ్, మేజర్ లాంటి సినిమాలతో మంచి సినిమాలు నిర్మిస్తుందని ముద్ర వేసుకున్న చాయ్ బిస్కెట్ ఫిలింస్ సంస్థ మేము ఫేమస్ అనే ఒక యూత్ ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుమంత్ ప్రభాస్, సార్య, సిరి రాశి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే యూత్లో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.


ఈ రెండు సినిమాలతో పాటు మలయాళం లో చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి కోట్ల రూపాయల వసూళ్లు కురిపించిన 2018 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. ఇవి కాకుండా మెన్ టూ అనే ఒక కామెడీ డ్రామా సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. బ్రహ్మాజీ, వైవా హర్ష, నరేష్ అగస్త్య కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేశాడు, చూడాలి ఈ శుక్రవారం నాడు ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విన్నరుగా నిలబడుతుంది అనేది.


Also Read: Dhanush’s D50: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సందీప్ కిషన్.. మళ్లీ ధనుష్ సినిమాలో కీ రోల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook