Vijay Devarakonda:ఇదెక్కడి క్రేజ్‌రా అయ్యా.. విజయ్ దేవరకొండకి ముంబైలో మెంటల్ మాస్ ఫాలోయింగ్
Mind Blowing Craze For Vijay Devarakonda at Mumbai:విజయ్ దేవరకొండకు ముంబైలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన క్రేజ్ చూసి మెంటల్ ఎక్కుతోంది అంటున్నారు అభిమానులు.
Mind Blowing Craze For Vijay Devarakonda at Mumbai: విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన ఇప్పుడు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు, నిజానికి ఇప్పటివరకు ఆయన నటించిన ఒక్క సినిమా కూడా నేరుగా హిందీలో విడుదల అవ్వలేదు. అయితే హిందీలో ఆయనకు ఏర్పడిన క్రేజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఆయన లైగర్ అనే సినిమాతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచేయగా ఇప్పుడు సినిమాను భారీ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు.
ఎందుకో ఏమో తెలియదు కానీ విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో మరీ ముఖ్యంగా ముంబైలో ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ అనన్య కలిసి ఆదివారం సాయంత్రం ముంబైలోని ఒక షాపింగ్ మాల్ కి వెళ్లారు. అయితే విజయ్ దేవరకొండ అక్కడికి వస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ కి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ షాపింగ్ మాల్ మొత్తం అభిమానులతో నిండిపోయింది.
అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడంతో నిర్వాహకులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది అమ్మాయిలు అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయిన పరిస్థితులు కనిపించాయి. ఇక అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి విజయ్, అనన్య అక్కడి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పటివరకు నేరుగా ఒక్క సినిమా కూడా బాలీవుడ్ లో విడుదల చేయని విజయ్ దేవరకొండకు ఇంత క్రేజీ ఏంట్రా నాయనా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే నిజానికి విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో డైరెక్ట్గా సినిమాలు చేయకపోయినా ఆయన చేసిన పలు సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి. అలాగే ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాను ఏకంగా రీమేక్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఏర్పడిందని భావిస్తున్నారు. ఇక లైగర్ సినిమా కనుక హిట్ అయితే ఆయన రేంజ్ వేరే లెవల్ కు వెళుతుందని విజయ్ దేవరకొండ అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు.
Also Read: Anbu Chezliyan: ప్రముఖ నిర్మాతపై ఐటీ రైడ్స్.. తమిళ పరిశ్రమలో కలకలం!
Also Read: NTR Family: ఎన్టీఆర్ కుటుంబానికి అసలు కలిసిరాని ఆగస్టు.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో వరుస మరణాలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook