Anbu Chezliyan: ప్రముఖ నిర్మాతపై ఐటీ రైడ్స్.. తమిళ పరిశ్రమలో కలకలం!

 Income Tax raids on Tamil producer Anbu Chezliyan: తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది. బడా బడ్జెట్ సినిమాలకు ఫైన్షియర్ గా ఉన్న అన్బు చెళియన్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2022, 09:44 AM IST
  • తమిళ సినీ పరిశ్రమలో కలకలం
  • ఆ టాప్ ఫైనాన్షియర్ పై ఐటీ రైడ్స్
  • ఒకే సమయంలో 10 ప్రాంతాల్లో
 Anbu Chezliyan: ప్రముఖ నిర్మాతపై ఐటీ రైడ్స్.. తమిళ పరిశ్రమలో కలకలం!

 Income Tax raids on Tamil producer Anbu Chezliyan: తమిళనాడులో ప్రముఖ ప్రొడ్యూసర్ ఫైనాన్షియర్  అన్బు చెళియన్ ఇంటి పైన ఐటీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దెబ్బతో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగినట్లు అయింది. చెన్నై సహా మొత్తం పది చోట్ల అన్బు చెళియన్ కి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై ఐటి రైడ్స్ జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. ఆయన తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫైనాన్షియల్ గా ఉన్నారు.

విజయ్ నటించిన బిగిల్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ కు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చారని సమాచారం. నిజానికి ఈ ఏడాది మార్చి చివరిలో కూడా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అన్బు చెళియన్ ఎవరెవరికి అయితే డబ్బు సమకూరుస్తున్నారో వారందరి మీద కూడా కన్ను వేసినట్లు ప్రచారం జరిగింది. మార్చి నెలలో ఆ నిర్మాతలు అందరికీ కూడా నోటీసులు జారీ చేసి పెద్ద ఎత్తున సోదాలు కూడా జరిపారు. దాదాపుగా తమిళ సినీ పరిశ్రమలో ఉన్న ఏడుగురు టాప్ నిర్మాతలకు అప్పట్లో నోటీసులు వెళ్లాయి.

అన్బు చెళియన్ నుంచి 6 నుంచి 75 కోట్ల వరకు వారంతా డబ్బులు తీసుకున్నట్లు  ప్రచారం జరిగింది. అన్బు చెళియన్ తో వ్యాపార లావాదేవీలు ఉన్న అందరూ నిర్మాతలకు అప్పట్లో నోటీసులు అందాయి. షో కాజ్ నోటీసులు జారీ చేసిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆయన నుంచి ఎందుకు డబ్బు తీసుకుంటున్నారు అనే విషయం మీద అప్పట్లో దర్యాప్తు జరిపినట్లు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరిలో కూడా అన్బు చెళియన్ మీద ఐటీ రైడ్స్ జరిగాయి. తరువాత ఆయనకు సంబంధించిన వ్యాపారా లావాదేవీలు ఉన్న వారిని విచారించారు.

ఇక ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.. మధురైలో సెటిలైన అన్బు చెళియన్ తమిళ సినీ పరిశ్రమలో అన్బు చెళియన్ ఒక టాప్ ఫైనాన్షియర్ గా ఉన్నారు. తమిళ సినిమాలకు ఆయన ఎక్కువగా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. గతంలో ఆయన మీద పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. సినిమాలకు ఫైనాన్సు చేసిన తర్వాత డబ్బు రాబట్టుకునే విషయంలో హరాస్మెంట్ చేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం  అయింది. 

Also Read: Uma Maheshwari Cremation Updates: ఉమా మహేశ్వరి అంత్యక్రియలకు తారక్ రావడం లేదా ?

Also Read: NTR's Daughter Uma Maheshwari Death LIVE Updates: ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్న నందమూరి కుటుంబసభ్యులు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News