Minister Roja Satires on Mega Family ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు కుప్పం పర్యటన ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు పెడుతున్న సభల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ర్యాలీలు,సభల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసింది. దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, నాగబాబు వంటి వారు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. వీటికి కౌంటర్లుగా రోజా సంచలన కామెంట్లు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుప్పం పర్యటన మీద ప్రత్యర్థులు చేసిన విమర్శలపై స్పందిస్తూనే.. మెగా ఫ్యామిలీ మీద కూడా కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్లను జన సైనికులు, మెగా ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు. నీకు అవసరం ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి చిరంజీవి ఇంటికి వెళ్తావ్.. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావా? అంటూ నానా రకాలుగా రోజాను టార్గెట్ చేస్తున్నారు.


 



అసలు ఇంతకీ రోజా ఏమందో ఓ సారి చూద్దాం. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్‌ గారు ఎంత స్థాయిలో ఉన్నా.. అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని.. సీఎంలు అయ్యారు.. కానీ ఈ కుటుంబంలో ఎవ్వరూ ఎందుకు కాలేదంటే.. వీళ్లని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు.. ఏ చిన్న సాయం కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు.. అన్నదమ్ములు ముగ్గుర్ని సొంత జిల్లాలోనే ఓడించారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి.. అంటూ రోజా మాట్లాడింది.


ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యలోకి చిరంజీవిని ఎందుకు లాగడం అంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. నాడు చిరంజీవిని కుటుంబ సమేతంగా కలిసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. రోజా అయితే పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడూ విమర్శల దాడి చేస్తూనే ఉంటుంది. ఇక కుప్పం విషయంలో చంద్రబాబును పవన్ కళ్యాణ్‌ సపోర్ట్ చేయడంతో ఇలా రోజా ఇష్టమొచ్చినట్టుగా శివాలెత్తింది. మొత్తం మెగా ఫ్యామిలీ, మెగా బ్రదర్స్‌ను లాగేసింది.


Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట


Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి